గోవా(Goa State) అంటే మనం ఎంతసేపూ బీచ్లు.. ఎంజాయ్మెంట్.. రిఫ్రెస్మెంట్ టూరిస్ట్ ప్రాంతం అనుకుంటాం.. కానీ.. అక్కడ ఆధ్యాత్మికత (Spiritual Culture)కూడా ఉంటుందని అంచనా వేయలేం. అక్కడి శిర్గావ్(Shirgav Area)లోని లైరాయి దేవి (Goddess Lairay Devi)ఆ ప్రాంత ప్రజలకు ఇలవేల్పు. ఏటా దేవి ఆలయంలో వార్షికోత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
‘అగ్ని దివ్య’ ప్రత్యేక పూజలను పురస్కరించుకొని శనివారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పూజల్లో భాగంగా భక్తులు నిప్పుల గుండంపై నడిచి మొక్కులు తీర్చుకుంటారు. అయితే నిప్పుల గుండంలో నడిచేందుకు పెద్ద ఎత్తున భక్తులు తోసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 80 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై ప్రధాని మోదీతో పాటు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.