end
=
Thursday, November 6, 2025
రాజకీయంతెలంగాణ సర్కార్‌కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు
- Advertisment -

తెలంగాణ సర్కార్‌కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

- Advertisment -
- Advertisment -

BC Reservation : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీం కోర్టు (Supreme Court)విచారణకు స్వీకరించలేదు. ఈ అంశం ఇప్పటికే హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉండటంతో, ఈ దశలో తమకు పునర్విచారణకు అవకాశం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9 ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో, హైకోర్టు గతంలో దీని అమలుపై స్టే విధించింది. ఈ స్టే ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 13న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. విచారణ అత్యవసరమని పేర్కొంటూ అక్టోబర్‌ 16 లేదా 17 తేదీల్లో విచారించాలని కోరుతూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ముందు మెన్షన్‌ చేసింది. స్పందనగా, ఈ కేసును నేటి విచారణ జాబితాలో చేర్చినప్పటికీ, సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదు.

ఇప్పటికే హైకోర్టులో ఇది పెండింగ్‌లో ఉండటాన్ని కారణంగా చూపిస్తూ, అదే కోర్టు తదుపరి విచారణ జరిపించాలని సూచించింది. తమ ముందు ప్రస్తుతం విచారణ చేయడం సాధ్యపడదని తెలిపిన సుప్రీం కోర్టు, హైకోర్టు మెరిట్‌ల ఆధారంగా విషయాన్ని తేల్చాలని స్పష్టం చేసింది. అదేవిధంగా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం గత రిజర్వేషన్లను ఆధారంగా తీసుకుని స్థానిక ఎన్నికలను నిర్వహించవచ్చని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్‌ జీవోపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, హైకోర్టు అక్టోబర్ 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తొందరగా ఎన్నికలు జరిపేందుకు కేంద్రంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసినప్పటికీ, ప్రస్తుతం అది ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. తద్వారా, బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరోసారి ఆలస్యానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -