end
=
Wednesday, November 19, 2025
వార్తలుజాతీయంఖైదీల ముందస్తు విడుదలపై 5 రాష్ట్రాలకు సుప్రీం డెడ్‌లైన్
- Advertisment -

ఖైదీల ముందస్తు విడుదలపై 5 రాష్ట్రాలకు సుప్రీం డెడ్‌లైన్

- Advertisment -
- Advertisment -

Supreme Court: ఖైదీల ముందస్తు విడుదల (Early release of prisoners)(రెమిషన్) విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు (Five states)సుప్రీంకోర్టు తుదిగడువు ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశిస్తూ, రెండు నెలల సమయాన్ని గడువుగా నిర్ణయించింది. గురువారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది. ‘ఇన్ రీ పాలసీ స్ట్రాటజీ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్’ అనే కేసులో సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టి, దేశవ్యాప్తంగా బెయిల్, రెమిషన్ విధానాల అమలు పరిస్థితిని పరిశీలించింది. లిజ్ మాథ్యూ సమర్పించిన వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పై ఐదు రాష్ట్రాలు ఇప్పటివరకు తమ ముందస్తు విడుదల విధానాలను, నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని గమనించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం చివరి అవకాశంగా రెండు నెలల గడువు ఇస్తున్నాం. ఈ కాలవ్యవధిలో అన్ని రాష్ట్రాలు నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఇకపై ఆలస్యం అంగీకరించబడదు అని స్పష్టం చేసింది. కేరళ రాష్ట్రం పాక్షికంగానే అమలు చేపట్టిందని కోర్టు పేర్కొంటూ, ముందస్తు విడుదల అభ్యర్థనలను తిరస్కరించినప్పుడు కారణాలను తప్పనిసరిగా తెలియజేయాలన్న చట్టపరమైన సవరణ కోసం నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఖైదీల హక్కులను కాపాడడమే లక్ష్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో, ప్రతి ఖైదీ ముందస్తు విడుదల అర్హత పొందే కనీసం ఆరు నెలల ముందు అతని కేసును రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షించాలనే ముఖ్యమైన సూచన చేసింది. దీని ద్వారా అర్హత సాధించిన తర్వాత కూడా ఖైదీలు అనవసరంగా జైల్లో కొనసాగాల్సిన పరిస్థితిని నివారించవచ్చని కోర్టు పేర్కొంది.

రెమిషన్ విధానాల అమలు పర్యవేక్షణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాన్ని జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హైకోర్టులు స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించింది. సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సుమోటోగా రిట్ పిటిషన్ నమోదు చేసి, ఒక ప్రత్యేక డివిజన్ బెంచ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. రెమిషన్ విధానాలు సమర్థవంతంగా అమలు కావడం ఖైదీల పునరావాసానికి, న్యాయ వ్యవస్థ న్యాయబద్ధతకు కీలకమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా ఖైదీల హక్కులు కాపాడటానికి, సమాన న్యాయవ్యవస్థను బలోపేతం చేయడమే ఈ నిర్ణయాల ఉద్దేశమని స్పష్టం చేసింది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -