end
=
Wednesday, January 7, 2026
వార్తలుజాతీయంవిద్యారంగంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక అడుగు
- Advertisment -

విద్యారంగంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక అడుగు

- Advertisment -
- Advertisment -

Tamil Nadu Govt : తమిళనాడు ప్రభుత్వం విద్యారంగం(Education)లో మరో కీలక అడుగు వేయబోతోంది. విద్యార్థులను సాంకేతికంగా శక్తివంతం చేయాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రతిష్ఠాత్మక ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ(Distribution of free laptops) పథకం సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ‘ఉలగం ఉన్ కైగలిల్’ (ప్రపంచం మీ చేతుల్లో) అనే ఆకర్షణీయమైన నినాదంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలి దశను ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చెన్నై ట్రేడ్ సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. డిజిటల్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు దశల్లో అమలు చేయాలని నిర్ణయించింది.

మొత్తం 20 లక్షల ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న ఈ కార్యక్రమంలో, తొలి దశలోనే 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్, లా, అగ్రికల్చర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులకు అందజేయనున్న ల్యాప్‌టాప్‌లు అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందించబడ్డాయి. డెల్, ఏసర్, హెచ్‌పీ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఈ పరికరాల్లో ఇంటెల్ i3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్ 365 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ విద్య, ప్రాజెక్ట్ వర్క్, రీసెర్చ్, స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ ల్యాప్‌టాప్‌ల ద్వారా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, వెబ్ డిజైనింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యం సాధించి మెరుగైన ఉపాధి అవకాశాలు పొందగలరని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. తమిళ్ పుదల్వన్, ఇన్నోవేటివ్ ఉమెన్, ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ వంటి పథకాలతో ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ ద్వారా పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించి, సమగ్ర అభివృద్ధిని సాధించాలన్నదే ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యంగా పేర్కొంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -