end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌..సదస్సులో ఏం చర్చించనున్నారంటే?
- Advertisment -

ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌..సదస్సులో ఏం చర్చించనున్నారంటే?

- Advertisment -
- Advertisment -

Telangana Rising Global Summit -2025 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్–2025కు ఇంకో రెండు రోజులు మాత్రమే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో భారీ ఏర్పాట్ల(Massive arrangements)ను పూర్తి చేసే దిశగా వేగంగా కదులుతోంది. దేశ విదేశాల నుంచి రానున్న ఎందరో ప్రముఖులు, భారీ సంఖ్యలో ప్రతినిధులను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అంతరాయాలు కలగకుండా అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ అభివృద్ధి(Future development of the state) దిశలో కీలకంగా నిలిచే ఈ అంతర్జాతీయ సమావేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట సమీపంలో దాదాపు వంద ఎకరాల్లో నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీ ప్రస్తుతం సమ్మిట్‌ వేదికగా పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. తెలంగాణను 20247 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రత్యేక విజన్ డాక్యుమెంట్‌ను ఈ వేదికపై ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు కలిసి చివరి అంచెల్లో పనులను సమీక్షిస్తున్నారు.

ఈ గ్లోబల్ సమ్మిట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 40కు పైగా దేశాల నుంచి దాదాపు 1,500 మంది ప్రముఖ విదేశీ ప్రతినిధులు హాజరుకానుండటం విశేషం. వీరిలో అనేక మంది ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతినిధులే కావడం ప్రత్యేకం. గూగుల్, అమెజాన్ వంటి అగ్రశ్రేణి కంపెనీలతో పాటు ఫార్మా, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ రంగాలకు చెందిన అంతర్జాతీయ హోదా కలిగిన అతిథులు కూడా పాల్గొననున్నారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమ్మిట్‌కు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 8 సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ సమ్మిట్‌ను బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయర్ శుభారంభం చేయనున్నారు. మొదటి రోజు వేదికపై బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌షా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కె. బెరి, మిస్ వరల్డ్ 2025 సుచతా చువాంగ్ శ్రీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ సీఈవో ఎరిక్ స్వైడర్ వంటి ప్రభావశీలులు పాల్గొంటారు. వర్చువల్‌గా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శాంతను నారాయణన్, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బగ్గా ప్రసంగించనున్నారు. క్రీడా, సినీరంగం నుండి పీవీ సింధు, రితేశ్ దేశ్‌ముఖ్, రిషబ్ శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

సదస్సులో మొత్తం 26 ప్యానల్‌ చర్చలు జరుగనున్నాయి. కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ, ఏరోస్పేస్–డిఫెన్స్, గిగ్ ఎకానమీ, మూసీ నది పునరుద్ధరణ, పర్యాటకం, ఒలింపిక్స్ సిద్ధత వంటి విభిన్న అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. వందలాది ప్రతినిధులు పాల్గొననున్న నేపథ్యంలో కార్యక్రమం పర్యవేక్షణ కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనిని సీనియర్ ఐఏఎస్ అధికారులు సబ్యసాచి ఘోష్, జయేష్ రంజన్, కృష్ణ భాస్కర్‌తో పాటు ఐఎస్‌బీ నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వార్ రూమ్‌కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వం వహిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. 100 శాతం అండర్‌గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్, ఒకేసారి 10 వేల మంది వినియోగించుకునే వైఫై, క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్‌ వ్యవస్థ, భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి దశకు చేరుకున్నాయి. భద్రత కోసం మూడు స్థాయిల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని, 1,500 మంది పోలీసులు, 1,000 మంది ట్రాఫిక్ సిబ్బంది, 1,000కిపైగా సీసీ కెమెరాలు అమర్చారు. సుమారు 5,000 మంది హాజరుకానున్న ఈ భవ్య గ్లోబల్ సమ్మిట్ తెలంగాణను కొత్త దిశగా తీసుకెళ్లే కీలక వేదికగా మారనుందని ప్రభుత్వం నమ్ముతోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -