ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసమర్థత(In efficient), చేతకాని పాలన (Incompetent rule) కారణంగానే తెలంగాణ (TG State) నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన(Ruling of Congress)లో తెలంగాణలో రూ.2,800 కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన ‘కేన్స్’ సంస్థ గుజరాత్‌కు వెళ్లిపోయిందని,
దీనివల్ల ప్రత్యక్షంగా 2,000 మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు గండిపడ్డాయని దుయ్యబట్టారు. దీంతో పదేళ్ల బీఆర్ఎస్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు మున్సిపల్, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాలు మురుగు నీరు, చెత్తకుప్పలతో నిండిపోయాయని పేర్కొన్నారు.
అపారిశుద్ధ్యం కారణంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలానికి రెండు నెలల ముందే సీజనల్ వ్యాధులపై సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకునేవాళ్లమని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
ప్రజలు అలమటిస్తుంటే పాలకులు మాత్రం “ఆర్ఆర్ ట్యాక్స్” వసూళ్లలో బిజీగా ఉన్నారని ఆయన విమర్శించారు.