end
=
Wednesday, December 24, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంతిరుగులేని ఔషదం త్రిఫల చూర్ణం ఉపయోగించే విధానాలు ఇవే..!
- Advertisment -

తిరుగులేని ఔషదం త్రిఫల చూర్ణం ఉపయోగించే విధానాలు ఇవే..!

- Advertisment -
- Advertisment -

Triphala powder : మనిషి ఆరోగ్యం.. వాత, పిత్త, కఫ, లక్షణాలు పెాచ్చు తగ్గులపైనే ఆధారపడి ఉంటుంది.ఈ పెాచ్చు తగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే “త్రిఫల చూర్ణం”. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి. కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెటలోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహ చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పై పెచ్చులతో చేసిన త్రిఫలచూర్ణం ప్రభావవంతమైంది. ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది.

జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్గా వాడి, మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్య పోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాదు త్రిపల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది. అలాగే త్రిఫల చూర్ణం కంటిచూపును పెంచుతుంది. జీర్ణశక్తి,ని ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గుతుంది, వాతం నొప్పులు తగ్గుతాయి, చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఉపయోగించే విధానం..ఉదయాన్నే పరిగడుపున అర గ్లాస్ గోరువెచ్చని నీటిలో చెంచా త్రిపల చూర్ణం వేసుకుని తాగాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా తాగాలి.

గమనిక:- ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. https://chat.whatsapp.com/IJHZODdLom99Vu61hzqrI4?mode=hqrc

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. Venkatesh 9392857411.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -