end
=
Thursday, May 16, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంNose Infections:ముక్కులో వేలు పెట్టేవారికి ఆ వ్యాధి లక్షణాలు..
- Advertisment -

Nose Infections:ముక్కులో వేలు పెట్టేవారికి ఆ వ్యాధి లక్షణాలు..

- Advertisment -
- Advertisment -

  • అల్జీమర్స్ వ్యాధికి సంకేతాలంటున్న వైద్యులు
  • ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఫలితం వెల్లడి


ముక్కులో (Nose) వేలుపెట్టి (Finger)గెలకడం అనేది ఆసక్తికరమైన (Interesting Habit) అలవాటు. కొంతమంది బోర్‌డమ్ (bore) లేదా నెర్వస్‌నెస్ నుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఒక కొత్త అధ్యయనం (Research) ప్రకారం, ఈ అలవాటుతో అల్జీమర్స్, డిమెన్షియా(చిత్త వైకల్యం) (Alzheimer’s, Dementia) వచ్చే ప్రమాదం ఉంది. ఒక బ్యాక్టీరియా (Bacteria) ముక్కులోని ఘ్రాణ నాడి ద్వారా మెదడులోకి ప్రయాణించగలదని ఎలుకల (Rat) పై చేపట్టిన ప్రయోగంలో ఆస్ట్రేలియన్ గ్రిఫిత్ యూనివర్సిటీ రీసెర్చర్స్ టీమ్ (A team of Australian Griffith University researchers) నిరూపించింది. ఇది అల్జీమర్స్ వ్యాధికి సంకేతాలను సృష్టిస్తుందన్నారు.

ఆలస్యంగా ప్రారంభమయ్యే చిత్తవైకల్యంతో ప్రభావితమైన మానవ మెదడుల్లో న్యుమోనియా (Pneumonia)కు కారణమయ్యే క్లామిడియా న్యుమోనియా (Chlamydia pneumoniae) అనే బ్యాక్టీరియా ఎక్కువ భాగం కనుగొనబడిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధన ప్రకారం.. ఇది నాసికా కుహరం, మెదడు మధ్య విస్తరించి ఉన్న నాడిని కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేయడానికి దండయాత్ర మార్గంగా ఉపయోగించింది. మెదడులోని కణాలు.. అల్జీమర్స్ వ్యాధి ముఖ్య లక్షణమైన అమిలాయిడ్ బీటా ప్రోటీన్‌ (Amyloid beta protein)ను డిపాజిట్ చేయడం ద్వారా ప్రతిస్పందించాయి. ఎలుకలపై నిర్వహించిన ఈ అధ్యయనానికి సంబంధించిన సాక్ష్యాలు మానవులకు కూడా భయానకంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.

ఘ్రాణ నాడి గాలికి గురవుతుందని, మెదడు (brain)కు అది చిన్న మార్గాన్ని అందిస్తుందని ఈ పరిశోధన జోడించింది. ఇది వైరస్‌లు (Virus), బ్యాక్టీరియా మెదడులోకి సులభంగా పసిగట్టిన మార్గం. అయితే ఈ అధ్యయనాన్ని మానవుల్లో చేపట్టి, ఈ మార్గం అదే విధంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించాలని, ఈ పరిశోధన ఇంకా పూర్తి కాలేదని ప్రొఫెసర్ (Professor)వెల్లడించారు. ఇక ముక్కు తీయడంతో పాటు ముక్కు నుంచి వెంట్రుకలు (Hairs)తీయడం మంచిది కాదని అతను చెప్పాడు. ఎవరైనా వారి ముక్కు లైనింగ్‌ను దెబ్బతీస్తే, వారి మెదడులో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. కాగా వాసన (Smell) కోల్పోవడం అల్జీమర్స్‌కు ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుందని పరిశోధనా బృందం పేర్కొంది.

(Mungode:మునుగోడు ఫలితం ఎవరికి మేలు చేస్తుంది..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -