end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Marriages:లగ్గానికి మొగ్గుచూపని నేటి యువతరం
- Advertisment -

Marriages:లగ్గానికి మొగ్గుచూపని నేటి యువతరం

- Advertisment -
- Advertisment -

  • ఆలస్య వివాహాలకే ఓటేస్తున్న మెజారిటీ ఉమెన్
  • ముప్పైకి చేరువైతే గానీ మోగని పెళ్లి బాజాలు
  • పెళ్లిని ఓల్డ్ కాన్సెప్ట్‌గా కొట్టిపారేస్తున్న మోడ్రన్ లేడీస్

సొసైటీ నిర్బంధాలను దాటుకుంటూ ఈ రోజుల్లో ఒక మహిళ (women) స్వేచ్ఛగా (freedom)బతకడం ఎంత కష్టమో తెలియంది కాదు. చదువు (Education), ఉద్యోగం (Job), పెళ్లి (Marriage).. ఇలా జీవితంలోని కీలక నిర్ణయాలు నేటికీ మెజారిటీ యువతుల (Girls)చేతుల్లో లేవు. ఇక పాతికేళ్లు దాటాయంటే చాలు.. తల్లిదండ్రులు (Parents), బంధుగణం సహా అన్ని వైపుల నుంచి పెళ్లి గురించిన ప్రస్తావనే. ఇంకెప్పుడు చేసుకుంటావనే ఒత్తిడే. అదే ముప్పై ఏళ్లకు చేరువయ్యారంటే ఆ ఒత్తిడి స్థాయి గురించి చెప్పనక్కర్లేదు. అయితే, ఆలస్యంగా వివాహం (Marriage)చేసుకోవడం ఇప్పుడు అమ్మాయిల్లోనూ కామన్ అయిపోయింది. కాలక్రమేణా మారుతున్న పరిస్థితులకు ఇది అద్దం పడుతుండగా.. ఇందుకు వివిధ కారణాలున్నాయి. అవి ఏంటో చూద్దాం..

గణాంకాల ప్రకారం..

13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (National Family Health Survey) ‘NFHS’ నివేదిక ప్రకారం, కాలక్రమేణా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. 10+2 లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నవారు ఇతర మహిళల కంటే చాలా ఆలస్యంగా వివాహం చేసుకున్నారని ఈ నివేదిక పేర్కొంది. ‘25-49 ఏళ్ల వయసు మహిళలను పరిశీలిస్తే.. వారి మొదటి వివాహానికి మధ్యస్థ వయస్సు చదువుకోనివారిలో 17.1 ఏళ్లకు, 10+2 పైగా విద్యార్హత గలవారిలో 22.8 ఏళ్లకు పెరిగినట్లు తేలింది. ఇక 25-49 ఏళ్ల వయసు గల మహిళలకు మొదటి వివాహానికి మధ్యస్థ వయసు ఇతర నిర్దిష్ట మతాల స్త్రీల(18.7-19.7 ఏళ్లు) కంటే జైనం(Jain) (22.7 ఏళ్లు), క్రిస్టియన్ (christian)(21.7 ఏళ్లు), సిక్ (Sik)(21.2 ఏళ్లు) మహిళల్లో ఎక్కువగా ఉందని NFHS చెప్పింది. మరోవైపు ప్రభుత్వం వివాహానికి చట్టబద్ధ వయసు 21కి పెంచడమూ చాలా ఒత్తిడిని తగ్గిస్తోంది.

(Women’s freedom: స్త్రీ స్వేచ్ఛ కోసం మేల్ రైట్స్ విస్మరించవచ్చా?)

కాలం మారింది :

సెక్సిజం(sexism), అధికారిక విద్య లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా స్త్రీలు పురుషుల కంటే చాలా ముందుగానే వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మహిళలు అధికారిక విద్యను పొందుతున్నారు. స్కూల్స్(scools), కాలేజెస్‌ (college)తో పాటు తమ కెరియర్స్‌ (carrier)లోనూ రాణిస్తున్నారు. వారి జీవితాల గురించి ఆలోచించే స్వాతంత్ర్యం వారికి ఉంది. అంతేకాదు మహిళలు ఇప్పుడు తమ వ్యక్తిగత అభివృద్ధి, ఎదుగుదలకు కృషి చేయాలనుకుంటున్నారు.

అదనపు ఒత్తిడికి  సిద్ధంగా లేరు :

పాండమిక్ టైమ్‌ (pandemic)లో ఇంటి పని, కెరీర్స్, పిల్లల (childrens)నిర్వహణకు సంబంధించి మహిళలు సూపర్‌హీరోలుగా ఎలా పరిగణించబడుతున్నారో అనేక కథనాలు వెలువడ్డాయి. ఇలా అధిక భారం, అధిక పనిని రొమాంటిసైజ్ చేసినందున, అది స్త్రీలు చేయాల్సిన పని అని కాదు. చాలా మంది మహిళలు తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటారు. అందుకే వివాహంతో వచ్చే అదనపు బాధ్యతలకు సిద్ధంగా ఉండటం లేదు. కుటుంబ (Family) పోషణ కంటే కెరీర్ ముఖ్యమనే భావన పెరుగుతోంది. అయితే, పాత తరాలకు చెందిన మహిళలకు ఇలాంటి ఆప్షన్ (option)లేదు.

రొమాన్స్ లోపించడం వల్ల కాదు :

వయసు పెరిగే కొద్దీ స్త్రీలు.. రొమాంటికల్లీ (Romance), మెంటల్లీ (mentally)తమకు అనుకూలమైన వారితో జీవితం గడపాలని కోరుకుంటున్నట్లుగా గ్రహిస్తారు. అరేంజ్డ్ (Arrange marriage))మ్యారేజ్ అనే ఆలోచన ఇప్పుడు మహిళలకు అంతగా వ్యామోహం కాదు. వారు ప్రేమించాలని కోరుకుంటారు. అంతిమ లక్ష్యం ఆనందం అయితే వారు మరికొంత కాలం వేచి ఉంటారు.

(Smoking:మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్న స్మోకింగ్..)

నిర్ణయాలకు అధిక సమయం :

ఒకరి వ్యక్తిత్వం, ఆకాంక్షలు, జీవిత లక్ష్యాలు ఐదేళ్ల వ్యవధిలో మారగలవని అందరం అంగీకరించవచ్చు. 23 ఏళ్ల వయసులో ఉన్న జీవిత లక్ష్యాలు 28 ఏళ్లలో ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మహిళలు తమను తాము కనుగొని, వారికి ఎవరు ఎక్కువగా అనుకూలంగా ఉన్నారో చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి (joint family)కుటుంబంలో ఉండేందుకు లేదా పిల్లలు కనేందుకు ఇష్టపడని చాలా మంది మహిళలు ఉన్నారు. అవన్నీ నిజంగా జీవితాల్లో భారీ మార్పులు, ఇప్పుడు నిర్ణయాలకు సమయం తీసుకోవడం పూర్తిగా సహేతుకమైనదిగా అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పెళ్లి అనేది పాత కాన్సెప్ట్ (Old concept)అని, ఆ బంధంలో చిక్కుకోవడం సమంజసం కాదని మరికొందరు మహిళలు భావిస్తున్నారు.

ఇక చాలా మంది మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకునేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ, ఎప్పుడు సరైనదనిపిస్తే అప్పుడు చేసుకోవడమే మంచిది. ఈ నేపథ్యంలో లేట్ మ్యారేజెస్ గురించి పలువురు ప్రొఫెషనల్ (Professional)ఉమెన్ అభిప్రాయాలు

‘వివాహం జీవితంలో చాలా బాధ్యతలు మోపుతుందని నేను భావిస్తున్నాను. ఎటువంటి ప్రణాళిక, ప్రిపరేషన్ (Preparation) లేకుండా ఆ బంధాలను, బాధ్యతలను మోయలేం. లేదంటే అవి ఒత్తిడితో కూడుకున్నవిగా మారవచ్చు. ముందుగా నా సమయాన్ని వర్క్‌, నా సొంత లక్ష్యాలపై (Target)ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను తర్వాత పశ్చాత్తాపపడను.

-ముస్కాన్, గ్రాఫిక్ డిజైనర్ (Muskan, graphic designer)

‘ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రస్తుతానికి నా జీవితంలో అలాంటి వ్యక్తి లేడు కాబట్టి వెయిట్ చేస్తున్నాను’.

-శ్రేయ, సేల్స్ మేనేజర్ (Shreya, Sales Manager)

‘నాకు కంఫర్టబుల్‌గా లేని వ్యక్తితో స్థిరపడాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే అదే వ్యక్తితో నేను నా శేష జీవితం గడపాలి. నాకు నచ్చిన సమయంలో నా కోసం ఒకరిని కనుగొనగలను.

-పాయల్, వీడియోగ్రాఫర్ (Payal, videographer)

శారీరక అవసరాలు డిస్టర్బ్ చేస్తున్నందున నేను కెరియర్‌లో స్థిరపడేందుకు నిరాకరిస్తున్నాను. అందుకే సరైన మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాను.

– దివ్య (Divya)

నాకు ఇక పిల్లలు వద్దని నేను గ్రహించాను. కాబట్టి ఇదే దృక్ఫథం గల వ్యక్తిని కనుగొనేందుకు కాస్త టైమ్ కావాలి.

-నేహా, స్టైలిస్ట్ (Neha, stylist)

కెరీర్‌పై దృష్టి పెట్టాలని, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. – చాహత్, డాక్టర్ (Dr. Chahat)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -