బెగంపేట్‌లొ తాజ్ వివాంతా హోటల్ లైవ్ వర్క్ షాప్
Hyderabad : వ్యాపార వృద్ధి, ఉద్యోగుల నిర్వహణ, వ్యాపార వ్యూహాలపై పూర్తి మార్గదర్శకత్వం అందించే “అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ ప్రోగ్రామ్”(Ultimate Business Mastery Program) 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడుతుంది. ప్రముఖ బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ ఆధ్వర్యం(Under the direction of Venu Kalyan)లో నిర్వహించిన ఈ వర్క్ షాప్కి రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి బిజినెస్ ఓనర్స్, ఇన్సూరెన్సు ఆడ్వైజర్స్, రియాల్ ఎస్టేట్ వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ బిజినెస్ కోచ్ వేణు కల్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ” లైవ్ వర్క్షాప్ తొలి రోజు ఘనంగా జరిగింది. శనివారం ఉదయం బెగంపేట్లోని వివాంతా హోటల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
విన్-విన్-విన్ సిస్టమ్తో సక్సెస్ ఫార్ముల
వ్యాపార ప్రపంచంలో ముందంజలో నిలవాలంటే కస్టమర్స్, టీమ్, బిజినెస్ ఓనర్స్ అందరూ లాభాలు పొందే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని వేణు కల్యాణ్ సూచించారు.“ఆలోచన మారితే… వ్యాపారం మారుతుంది! వ్యాపారం మారితే… జీవితం మారుతుంది!” అంటూ ఆయన పాల్గొన్న వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. సెషన్ మొత్తం పవర్-ప్యాక్డ్ లెర్నింగ్స్… నెక్ట్స్ లెవల్ ఎనర్జీ… ఆక్షన్కు దారితీసే ఫ్రేమ్వర్క్స్తో నిండి ఉండటంతో పాల్గొన్న వారి స్పందన అదిరిపోయేలా ఉందని నిర్వాహకులు తెలిపారు. “ఇలాంటి ప్రాక్టికల్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్షాప్ అరుదగా దొరుకుతుదని పేర్కొన్నారు.
బిజినెస్ మాస్టరీ వర్క్షాప్..డే 2 విజయవంతం
టీమ్ బిల్డింగ్, హైరింగ్ – ఫైరింగ్ సిస్టమ్స్పై వ్యాపారులకు శిక్షణ
హైదరాబాద్లోని వివాంతా హోటల్ జరుగుతున్న మూడు రోజుల అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ వర్క్షాప్ రెండవ రోజు శనివారం అద్భుతంగా కొనసాగింది. వ్యాపార వృద్ధిలో కీలకమైన టీమ్ బిల్డింగ్, హైరింగ్ స్ట్రాటజీస్, ఫైరింగ్ సిస్టమ్స్పై వ్యాపారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా బిజినెస్ కోచ్ వేణు కళ్యాణ్ మాట్లాడుతూ..“సరిగ్గా ఎంపిక చేసిన టీమ్తోనే వ్యాపార విజయానికి కీలక మారుతుందన్నారు. సరైన మనస్తత్వం ఉన్న వ్యక్తులను నియమించుకోని, అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవడం లీడర్షిప్లో భాగం అని పేర్కొన్నారు.
వ్యాపారులు నేర్చుకున్న అంశాలు:
. నిబద్ధతతో, అధిక పనితీరుతో ఉన్న టీమ్ను ఎలా నిర్మించాలి
. రైట్ పర్సన్ను రైట్ రోల్కు ఎలా ఎంపిక చేయాలి
. సంస్థ సంస్కృతికి హాని కాకుండా ఉద్యోగులను ఎప్పుడు, ఎలా తొలగించాలి
. సంస్థలో Win-Win-Win కల్చర్ ఏర్పాటు పద్ధతులు
డే–2 మొత్తం స్పష్టత, నాయకత్వ నైపుణ్యాలు, ప్రాక్టికల్ స్ట్రాటజీస్తో కొనసాగింది. హాల్ అంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
