Vijay Deverakonda-Rashmika : టాలీవుడ్(Tollywood)లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంటగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(, Rashmika Mandanna) పెళ్లి (wedding)గురించి సోషల్ మీడియాలో మరోసారి హడావిడి మొదలైంది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, కెమిస్ట్రీ కారణంగా చాలా కాలంగా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ జంట వివాహానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో విజయ్–రష్మికల పెళ్లి జరగనుందనే సమాచారం బయటకు వచ్చింది. సంప్రదాయబద్ధంగా, కానీ చాలా ప్రైవేట్‌గా ఈ వేడుకను నిర్వహించాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని టాక్. దేశవ్యాప్తంగా ప్రముఖులు పెళ్లిళ్లకు ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారిన ఉదయ్‌పూర్‌ను వీరు కూడా ఎంచుకున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
అదేవిధంగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిందని తెలుస్తోంది. 2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుకను నిర్వహించినట్లు చెబుతున్నారు. పెద్ద హంగులు లేకుండా, పూర్తిగా గోప్యంగా ఈ కార్యక్రమం జరిగిందని సమాచారం. ఉదయ్‌పూర్ పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ మిత్రుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయాలపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన్న గానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ పెళ్లి వార్తలపై ఆసక్తికరంగా స్పందించారు. “ఈ వార్తలను నేను పూర్తిగా ఖండించను, అలాగని నిజమని కూడా చెప్పను. మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం” అంటూ ఆమె పరోక్ష సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో గాసిప్స్ మరింత ఊపందుకున్నాయి.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో విజయ్–రష్మికల జోడీకి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గత ఆగస్టులో న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్స్‌గా వీరిద్దరూ కలిసి పాల్గొన్నప్పుడు కూడా వారి మధ్య ఉన్న అనుబంధం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ చివరగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కింగ్‌డమ్’లో కనిపించారు. త్వరలోనే ‘రౌడీ జనార్దన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు రష్మిక మందన్న ఇటీవల ఆయుష్మాన్ ఖురానాతో ‘తమ్మ’ చిత్రంలో, తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కాక్‌టెయిల్ 2’, ‘మైసా’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్, రష్మిక మరోసారి జతకట్టే అవకాశం ఉందనే వార్తలు కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
