కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ(Rahul gandhi) మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) పై నిప్పులు చెరిగారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం జరిగిన ‘ఓట్ అధికార్ ర్యాలీ’ (Vote Adhikar Rally)లో ఆయన ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బీజేపీ(BjP) ఓట్ల దొంగతనాని (Votes Theft)కి ఎన్నికల సంఘం సహకరిస్తోందని, బీజేపీ, ఈసీ కలిసి ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఓట్ల దొంగలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ప్రజలు చైతన్యంతో ఉండాలని, ఎన్నికల్లో న్యాయం నిలవాలంటే అధికార యంత్రాంగం కక్ష సాధింపులు లేకుండా వ్యవహరించాలని రాహుల్ గాంధీ అన్నారు.
కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో మీరు ఎంత తెలివిగా దాక్కున్నా, మిమ్మల్ని తప్పకుండా పట్టుకుంటామని ఈసీని ఉద్దేశించి పేర్కొన్నారు. ఎన్నికలు దేశ గుండె చప్పుడని, ఒక్క ఓటు దొంగతనం జరిగినా అది దేశ ప్రజల గొంతును నొక్కేయడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఈసీ తమ ఐదు ప్రశ్నలకు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
త్వరలో ఈసీ వద్దకు కవాతుగా వెళ్లి మెమోరాండం ఇస్తామని ప్రకటించారు. ర్యాలీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు.