end
=
Monday, January 26, 2026
వార్తలు'ఐబొమ్మ'ను మూసివేశాం.. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన
- Advertisment -

‘ఐబొమ్మ’ను మూసివేశాం.. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన

- Advertisment -
- Advertisment -

iBomma: తెలుగు సినిమా పరిశ్రమ(Telugu film industry)ను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిన పైరసీ వేదిక ‘ఐబొమ్మ’(iBomma) చివరికి తన కార్యకలాపాలపై పూర్తిస్థాయి తెరదించింది. గత కొన్ని రోజుల నుంచి ఈ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయబోయే వినియోగదారులకు, “మీరు మా గురించి ఇటీవల విన్నా ఉండొచ్చు, లేదా మొదటి నుంచే మా అభిమానిగా ఉండొచ్చు. ఎలా ఉన్నా, మీ దేశంలో మా సేవలను శాశ్వతంగా నిలిపివేశామని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము” అనే సందేశం మాత్రమే కనిపిస్తోంది. ఈ నోటిఫికేషన్ బయటపడిన వెంటనే, ఐబొమ్మ శాశ్వత మూత వెనక ఉన్న కారణాలపై ఆసక్తి పెరిగింది.

ఈ పరిణామాలకు మూలం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పెద్ద ఆపరేషన్‌ అని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి, కొంతకాలంగా కరీబియన్‌ దీవుల్లో నివసిస్తూ ఐబొమ్మతో పాటు బప్పం టీవీ వంటి పలు పైరసీ వేదికలను నడుపుతున్నాడని విచారణలో తెలిసింది. నూతన చిత్రాల ఒరిజినల్ కాపీలు, మాస్టర్ ప్రింట్లను అనధికార మార్గాల్లో సేకరించి, తన వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడం ద్వారా రవి భారీ మొత్తంలో డబ్బులు గుద్దుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. అయితే, తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల కారణంగా రవి కొంతకాలం క్రితం భారత్‌కు వచ్చాడు. భార్యతో విడాకుల కేసు సంబంధించిన విషయాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో, ఆమె అందించిన వివరాల ఆధారంగా పోలీసులు రవిని గుర్తించినట్లు తెలుస్తోంది. అనంతరం, కూకట్‌పల్లిలోని అతని నివాసంపై దాడి చేసి, రవిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన వెంటనే, అధికారుల ఆదేశాల మేరకు రవి తానే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను పూర్తిగా డౌన్ చేశాడు. పైరసీ ద్వారా వచ్చిన అక్రమాదాయంతో అతడు హైదరాబాద్‌లో రూ. 3 కోట్లకు పైగా విలువ చేసే భవనం కొనుగోలు చేసినట్లు కూడా విచారణలో బయటపడింది. ఈ ఆస్తి ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐబొమ్మ, బప్పం టీవీల మూసివేతతో తెలుగు సినీ పరిశ్రమ కొంతవరకు ఊపిరిపీల్చుకున్నట్లు అనిపించినా, పైరసీకి ఇది పూర్తిస్థాయి ముగింపు కాదని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు భారీ నష్టం కలిగించిన ఈ పెద్ద నెట్‌వర్క్‌ ఒక్కసారిగా కూలిపోవడం పరిశ్రమవర్గాలను సంతృప్తి పరచింది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -