end
=
Sunday, January 25, 2026
వార్తలురాష్ట్రీయంఏఐ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్
- Advertisment -

ఏఐ దిశగా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

- Advertisment -
- Advertisment -

America Tour: దేశంలో రాబోయే కృత్రిమ మేధ (AI) విప్లవాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) వెల్లడించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన శాన్‌ఫ్రాన్సిస్కో సిలికాన్ వ్యాలీలో జరిగిన ‘బే ఏరియా కౌన్సిల్’ సమావేశంలో పాల్గొని పెట్టుబడిదారులతో విస్తృతంగా చర్చించారు. లోకేష్ మాట్లాడుతూ, ఏపీ యువ రాష్ట్రంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రస్తుతం 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను తదుపరి దశలో 2.4 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీనికి అవసరమైన 15 శాతం వార్షిక వృద్ధిని సాధించేందుకు క్లస్టర్ ఆధారిత అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నామని వివరించారు. ఆటోమోటివ్, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, సీబీజీ, ఆక్వా, ఓట్స్, AI వంటి 20 ప్రధాన రంగాలను ఈ క్లస్టర్లలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

కియా గ్లోబల్ ఉత్పత్తిలో 9 శాతం వాటా ఏపీ నుంచే రావడం, దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీ వాటా ఉండటం రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. రాబోయే 24 నెలల్లో ఈ వాటాను 70 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పునరుత్పాదక శక్తి రంగంలో ఏపీ ఇప్పటికే టాప్–5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తున్నదని గుర్తుచేశారు. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలనే ప్రశ్నకు మూడు కీలక కారణాలు వివరించారు. సుభ‍‍ద్ర నాయకత్వం, వేగవంతమైన అమలు సామర్థ్యం, కేంద్రంతో సమన్వయంతో పనిచేసే డబుల్ ఇంజన్ ప్రభుత్వం. సీఎం చంద్రబాబుకు ఉన్న పటిష్ఠ అనుభవం, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఉత్సాహం, 17 మంది కొత్త మంత్రుల వినూత్న ఆలోచనలు రాష్ట్రానికి అదనపు బలం ఇస్తున్నాయని చెప్పారు. పెద్ద పెట్టుబడులపై ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వ్యక్తిగతంగా ఫాలోఅప్‌ చేస్తున్నామని వివరించారు.

ఆదిత్య మిట్టల్‌తో తొలి జూమ్ కాల్ నుంచి కేవలం 16 నెలల్లో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశకు చేరడం, గూగుల్ ప్రాజెక్టు 13 నెలల్లో పురోగతి సాధించడం, ఈ నెల 12న కాగ్నిజెంట్ భూమిపూజ చేస్తున్నాం. ఇవన్నీ ఏపీ అమలు వేగాన్ని ప్రతిబింబిస్తాయి అని లోకేష్ చెప్పారు. ఏఐ ఆధారిత భవిష్యత్తు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని, ప్రతి కుటుంబంలో కనీసం ఒక ఏఐ నిపుణుడిని తయారు చేయడం సీఎం చంద్రబాబు విజన్ అని తెలిపారు. కాన్వర్సేషనల్ ఏఐ ఆధారంగా స్కిల్ సెన్సస్ నిర్వహించి, ఏసీ మెకానిక్ నుంచి ఏఐ ఇంజినీర్ వరకు అందరి సామర్థ్యాలను అంచనా వేయనున్నామని చెప్పారు. దేశ ఏఐ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ దారితీసేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఒరాకిల్, ఫ్యూజన్ ఫండ్, వియోనిక్స్ బయోసైన్సెస్, క్లీన్ స్టోన్ వెంచర్స్ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -