Maoists: ఎంఎంసీ (మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్)(Maharashtra,Madhya Prades,Chhattisgarh) జోన్ మావోయిస్టులు(Maoists) ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. జోన్ ప్రతినిధి అనంత్(Zone Representative Anant) పేరిట బయటకు వచ్చిన లేఖ(letter)లో, తమ సాయుధ పోరాటాన్ని అధికారికంగా విరమించుకుని, 2026 జనవరి 1న సమూహంగా లొంగిపోవడానికి (surrender) సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగతంగా కాదు, ఒకే రోజు అందరూ కలిసి ఆయుధాలు వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, గత కొంతకాలంగా జరిగిన పరిణామాలు ముఖ్యంగా అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, అలాగే హిడ్మా ఎన్కౌంటర్ పార్టీని తీవ్రంగా బలహీనపరిచాయని మావోయిస్టులు అంగీకరించారు. నాయకత్వం కోల్పోవడం, సురక్షిత ప్రాంతాల సంకుచితం కావడం, మరియు ప్రభుత్వ దళాల నిరంతర ఒత్తిడి కారణంగా పోరాటం కొనసాగించడం అసాధ్యమైందని వారు పేర్కొన్నారు.
అంతేకాక, కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చేసిన స్వచ్ఛంద లొంగుబాటు విజ్ఞప్తికి భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాస పథకాలను అంగీకరించడానికి సిద్ధమని వారు లేఖలో వెల్లడించారు. తమకు సహకరించగల ఏ రాష్ట్రంలోనైనా లొంగిపోవడానికి సిద్ధత చూపుతున్నామని చెప్పారు. ఈ ప్రకటన నేపథ్యంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు అందరూ లొంగిపోయే వరకూ సంయమనం పాటించాలని మావోయిస్టులు కోరారు. సురక్షితంగా లొంగుబాటు ప్రక్రియ జరగేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహకారం అవసరమని వారు స్పష్టం చేశారు. గత వారం విడుదల చేసిన మరో లేఖలో, సాధారణ ప్రజల జీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని మావోయిస్టులు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటనలతో, దశాబ్దాలుగా ఎంఎంసీ జోన్లో కొనసాగుతున్న మావోయిస్టు చట్రం కొత్త దిశలోకి మారుతున్నట్లు స్పష్టమైంది. ప్రభుత్వ పునరావాసం అంగీకరించడానికి సిద్ధమవుతున్నామని ప్రకటించడం, సమూహ లొంగుబాటుకు తేదీ ఖరారు చేయడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయంతో ఆ ప్రాంతాల్లో శాంతి, భద్రత పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయనే ఆశను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమూహ లొంగుబాటు వాస్తవంగా జరిగితే, ఎంఎంసీ జోన్లో దశాబ్దాల మావోయిస్టు తీవ్రవాద విభాగానికి అది ఒక పెద్ద ముగింపు కానుంది.
