end
=
Friday, July 18, 2025
రాజకీయంసర్కార్​కు హైకోర్టు మొట్టికాయలు
- Advertisment -

సర్కార్​కు హైకోర్టు మొట్టికాయలు

- Advertisment -
- Advertisment -

స్థానిక ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ?

సర్పంచ్ ఎన్నికల (Local Elections)ను ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana Government) హైకోర్టు (High Court)ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి, ఇంకా ఎందుకు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం (Angry on State Govt) చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు ఆరు పిటిషన్లు దాఖలు చేశారు.

వాటిపై సోమవారం న్యాయస్థానం విచారించింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిందని, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం 2024 జూలై 5తో పూర్తయిందని, నిబంధనల ప్రకారం ఆరునెలల లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, తీవ్రమైన జాప్యంపై మొట్టికాయలు వేసింది. రెండు వైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.

ఎన్నికల నిర్వహణకు 30 రోజులు, ఎన్నికల సంఘం 60 రోజుల గడువు కావాలని కోరినట్లు తెలిసింది. కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులో ఏముంది? ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. మొత్తంగా ఆగస్టు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -