end
=
Thursday, July 31, 2025
రాజకీయం31 నుంచి మీనాక్షి పాద‌య‌త్ర‌
- Advertisment -

31 నుంచి మీనాక్షి పాద‌య‌త్ర‌

- Advertisment -
- Advertisment -

పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ కూడా

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు (PCC Chief), ఎమ్మెల్సీ బీ మహేష్ కుమార్ గౌడ్‌ (Mahesh Kumar Goud), కాంగ్రెస్ వ్య‌వ‌హారాల రాష్ట్ర‌ ఇన్‌చార్జ్‌ (Congress State Incharge) మీనాక్షి నటరాజన్ (Meenaxi Natarajan) ఈనెల 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేప‌ట్ట‌నున్నారు. అప్ప‌టి నుంచి ఆగ‌స్టు 6 వ‌ర‌కు ఈ పాద‌యాత్ర జ‌రుగ‌నున్న‌ది. వీరి ప‌ర్య‌ట‌న ఆరు జిల్లా (Several Districts)ల్లో ఉంటుంది.

వీరు ఎక్క‌డ, ఏ రోజు ప‌ర్య‌ట‌న చేస్తే.. అక్క‌డే రాత్రి బ‌స చేయ‌నున్నారు. కార్యక్రమాల సమన్వయకర్తలుగా ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ (ఎమ్మెల్యే), శంకర్ నాయిక్ (ఎమ్మెల్సీ), డాక్ట‌ర్‌ కేతోరి వెంకటేష్, జులురు ధనలక్ష్మి, డాక్ట‌ర్‌ పులి అనిల్ కుమార్ వ్యవహరించనున్నారు.

షెడ్యూల్‌ ఇలా
జూలై 31: రంగారెడ్డి జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర
ఆగస్ట్ 1: రంగారెడ్డి జిల్లా పరిగి ప్రాంతంలో ఉదయం 11 గంటలకు శ్రమదానం, మధ్యాహ్నం 3 గంటలకు వర్కర్ల మీటింగ్
ఆగస్ట్ 1 సాయంత్రం: మెదక్ జిల్లా అంధోల్ (ఎస్సీ) నియోజకవర్గంలో పాదయాత్ర
ఆగస్ట్ 2: శ్రమదానం, పార్టీ మీటింగ్ తర్వాత – నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో సాయంత్రం పాదయాత్ర

ఆగస్ట్ 3: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ (ఎస్‌టి) నియోజకవర్గంలో కార్యక్రమాలు
ఆగస్ట్ 4: కరీంనగర్ జిల్లా చొప్పదండి (ఎస్సీ) నియోజకవర్గంలో పాదయాత్ర
ఆగస్ట్ 5: వరంగల్ జిల్లా వర్ధన్నపేట (ఎస్సీ) నియోజకవర్గంలో పాదయాత్ర
ఆగస్ట్ 6: ఉదయం శ్రమదానం, మధ్యాహ్నం వర్కర్ల మీటింగ్

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -