Samantha – Raj Nidimoru: నటీమణి సమంత రూత్ ప్రభు Samantha Ruth Prabhu గురించి ఇటీవల బాలీవుడ్‌తో సంబంధాలపై పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(raj nidimoru)తో ఆమె మధ్య సన్నిహితత్వం పెరిగిందన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే చర్చలకు తాజాగా సమంత తీసుకున్న స్టెప్ మరింత ఊతమిచ్చింది. తాజాగా జరిగిన దీపావళి పండుగను సమంత, రాజ్ నిడిమోరు కుటుంబంతో కలిసి జరిపారు. రాజ్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్‌కు సమంత హాజరై, కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచాలు కాలుస్తూ సందడి చేశారు. ఆ వేళ తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుండగా, సమంత పెట్టిన క్యాప్షన్ ‘‘నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’’ నెటిజన్ల దృష్టిని మరింత ఆకర్షించింది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, వీరిద్దరి మధ్య నిజంగా ఏమైనా ఉందా అనే అనుమానాలు మళ్ళీ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ తరచూ కలిసి కనిపించడమూ, ఇటీవలి ఫ్యామిలీ ఈవెంట్లలో సమంత స్నేహితురాలిగా కాకుండా ‘కుటుంబ సభ్యురాలిగా’ ఉండడమూ గమనార్హం. రాజ్-డీకే డైరెక్షన్‌లో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’లో సమంత శీలా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ సమయంలోనే రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత అదే బృందం రూపొందించిన ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ కోసం కూడా ఈ జోడీ మళ్ళీ కలిసారు. అప్పటి నుండి వీరి మధ్య బంధం మరింత బలపడిందని టాక్.
అయితే వీరిద్దరూ ఇప్పటి వరకూ తమ సంబంధం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదంతా కేవలం మిత్రత్వమేనా? లేక ఇది ప్రేమకథకు నాంది కానుందా? అన్నది సమయం చెప్పాల్సిన విషయం. ఇదిలా ఉండగా, సమంత సినిమాల విషయానికొస్తే ఆమె లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ బిజీ అవుతోంది. నందినిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘మా ఇంటి బంగారం’ అనే ఫ్యామిలీ డ్రామా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే కాకుండా, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే భారీ మల్టీలాంగ్వేజ్ ఫాంటసీ ప్రాజెక్ట్‌లో సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సమంత వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్‌లోనూ కొత్త అడుగులు వేస్తున్న వేళ ఈ రూమర్లు ఎంతవరకూ నిజమవుతాయో చూడాలి.
