end
=
Sunday, December 21, 2025
వార్తలురాష్ట్రీయంపసిపిల్లల ప్రాణాలతో చెలగాటం..ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్..ఎక్కడో తెలుసా?!
- Advertisment -

పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం..ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్..ఎక్కడో తెలుసా?!

- Advertisment -
- Advertisment -

. ఎంజీఎం పిల్లల వార్డులో దయనీయ స్థితి..
. ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్..
. వైద్యపరీక్షలకు పిల్లలను తరలిస్తుండగా తీసిన వీడియో వైరల్..
. వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్..

Warangal : దక్షిణ తెలంగాణకు ఆరోగ్యదాయినిగా పేరున్న ఎంజీఎం ఆసుపత్రి(MGM Hospital) ప్రభ రోజురోజుకూ మసకబారుతున్నది. ఆస్పత్రిలోని పిల్లల వార్డు(Children’s ward)లో శనివారం దయనీయమైన ఘటన చోటుచేసుకున్నది. వైద్యాధికారుల పర్యవేక్షణ లోపమో,ఆలసత్వమో తెలియదు గానీ, వైద్యసిబ్బంది ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్(Oxygen cylinder) అమర్చారు. వైద్యపరీక్షల నిమిత్తం పిల్లలను తరలించాల్సి రావడంతో ఇద్దరు పసికందులను వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు ఎత్తుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌ను మరో వ్యక్తి మోసుకెళ్తున్నాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆస్పత్రిలోని పిల్లలవార్డుకు రాష్ట్రనలుమూలల నుంచి తల్లిదండ్రులు వేర్వేరు సమస్యలతో బాధపడుతున్న పిల్లలను తీసుకొస్తారు. ఇక్కడ చిన్నారులకు పారా మెడికల్, రేడియాలజీ సేవలు అందుతాయి.

కానీ, వైద్యాధికారులు ఈ వార్డును పట్టించుకోకపోవడం, వైద్యసిబ్బంది ఇష్టారీతిన వైద్యం చేస్తుండటం పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా శనివారం ఇద్దరు పసి పిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చి, పరీక్షలకు తరలిస్తుండటం మరింత ఆందోళన రేపింది. కనీసం పిల్లలను తీసుకెళ్లేందుకు కేర్ టేకర్లు కూడా లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం దాయమ్మ లేదా పేషెంట్ కేర్ సిబ్బంది చిన్నారులు తరలించాల్సి ఉంది. వార్డు బాధ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -