end
=
Wednesday, December 31, 2025
వార్తలుజాతీయంగంగా నదిలానే బీజేపీ విజయాలు దేశమంతా వ్యాపిస్తున్నాయి: ప్రధాని మోడీ
- Advertisment -

గంగా నదిలానే బీజేపీ విజయాలు దేశమంతా వ్యాపిస్తున్నాయి: ప్రధాని మోడీ

- Advertisment -
- Advertisment -

Bihar Assembly Election : బీహార్‌(Bihar)పైగా ప్రవహించి పశ్చిమ బెంగాల్‌(West Bengal)ను చేరే గంగా నదిని ఉదాహరనగా తీసుకుంటూ, “గంగా (Ganga)ఎలా ముందుకు సాగుతుందో, బీజేపీ విజయాలు (BJP wins)కూడా అలానే దేశమంతా వ్యాపిస్తున్నాయి” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ఘనవిజయం సాధించిన అనంతరం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి పార్టీ నేతలు, వేలాది కార్యకర్తలు హర్షధ్వనులతో ఘన స్వాగతం పలికారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్‌తో పాటు పలువురు అగ్రనేతలు మోదీకి గజమాలతో సత్కారం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన మోదీ, బీజేపీ ఎదుగుదలకు పార్టీ కార్యకర్తలే నిజమైన శక్తి అని స్పష్టం చేశారు. మీ ఆశలు నా లక్ష్యాలు, మీ కలలు నాకు దిశ, మీ అంకితభావమే పార్టీకి పునాది అని చెబుతూ కార్యకర్తల సేవను ఆయన అభినందించారు. బీహార్‌లో సాధించిన ఈ విశేష విజయానికి నిష్టూరైన కృషితో రాత్రింబవళ్ళు శ్రమించిన కార్యకర్తలే కారణమని అన్నారు.

బీహార్‌లో బీజేపీ సాధించిన ఈ ప్రాభవం ఇకపై పశ్చిమ బెంగాల్‌లోనూ పార్టీకి విజయపథం చూపుతుందని మోదీ పేర్కొన్నారు. గంగా ప్రవహించే దారిలానే బీహార్ నుంచి వచ్చిన విజయ శుభవార్త రాష్ట్రం తర్వాతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో కూడా ప్రతిఫలిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం నెలకొల్పడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పార్టీ నాయకత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

బీహార్ నుంచి వచ్చిన ఈ విజయోత్సాహం ఒకే రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఉత్సాహాన్నిచ్చిందని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి దేశవ్యాప్తంగా పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు. బీహార్‌లో ‘జంగిల్ రాజ్’ పాలనను ముగించినట్లే, పశ్చిమ బెంగాల్‌లోనూ అదే విధమైన అవ్యవస్థ పాలనను తరిమికొట్టే బాధ్యత అక్కడి బీజేపీ కార్యకర్తలపై ఉందని అన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే రంగంలోకి దిగి కఠోర శ్రమ చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జెండా బెంగాల్‌లో రెపరెపలాడే రోజు దూరంలో లేదని, అందరూ ఏకమై శ్రమిస్తే పార్టీ మరింత ఘనవిజయాలు సాధిస్తుందని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -