end
=
Friday, January 23, 2026
వార్తలుజాతీయంరాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు: ‘బిల్లుల’ అంశంపై సుప్రీం కీలక తీర్పు
- Advertisment -

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు: ‘బిల్లుల’ అంశంపై సుప్రీం కీలక తీర్పు

- Advertisment -
- Advertisment -

Supreme Court: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి(President) లేదా గవర్నర్ ఆమోదం(Governor’s approval) కోసం పంపించే బిల్లులపై నిర్ణయం తీసుకునే గడువు విధించాలా అన్న ప్రశ్నపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu)పంపిన ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)రాజ్యాంగ ధర్మాసనం గురువారం అత్యంత కీలక తీర్పు ఇచ్చింది. బిల్లుల ఆమోదానికి గడువు నిర్దేశించడం రాజ్యాంగంతో విరుద్ధమని స్పష్టంచేస్తూ, కార్యనిర్వహణలో గవర్నర్లు, రాష్ట్రపతి అనుసరించాల్సిన రాజ్యాంగ పరిమితులపై మార్గదర్శకాలు ఇచ్చింది. రాష్ట్రపతి మరియు గవర్నర్లు తమకు పంపించిన బిల్లులపై “అనవసర ఆలస్యం” చేయకూడదన్న దానిని రాజ్యాంగం సూచిస్తుందిగానీ, వారికి ఒక నిర్దిష్ట కాలపరిమితి విధించడం సరికాదని వ్యాఖ్యానించింది.

రాజ్యాంగం చెప్పిన “as soon as possible” అనే పదబంధానికి గడువు నిర్ణయించే స్వభావం లేదని, దీనిని న్యాయస్థానం పరిమితి విధించే ప్రక్రియగా మార్చలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయితే, గవర్నర్ల అధికారాల విషయంలో కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. గవర్నర్‌ ఒక బిల్లును తిరిగి పంపేటప్పుడు స్పష్టమైన కారణాలు చెప్పడం తప్పనిసరి అని ధర్మాసనం చెప్పారు. “కారణం లేకుండా” బిల్లును వెనక్కి పంపడం రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేసినట్టే అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు ఇది కీలకమని న్యాయస్థానం అభిప్రాయపడింది. గవర్నర్లు అపరిమిత అధికారాలు కలిగిన వ్యక్తులు కాదని, వారి అధికారం రాజ్యాంగం నిర్ధేశించిన పరిమితులకే లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌కు విచక్షణాధికారం ఉన్నప్పటికీ, అది “అన్యాయంగా లేదా యాదృచ్ఛికంగా” వినియోగించబడి ఉండకూడదని హెచ్చరించింది.

రాష్ట్రపతి విషయానికొస్తే కూడా ఇదే సూత్రాలు వర్తిస్తాయని, వారు నిర్ణయాలు తీసుకోవాల్సింది రాజ్యాంగ విలువలను దృష్టిలో ఉంచుకుని గానేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టి పాలనను అడ్డుకుంటున్నాయన్న ఆరోపణలు చేస్తున్న సమయంలో వచ్చిన ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ రాజ్యాంగపరంగా సమతుల్య పాత్రను పోషించాలని, ప్రభుత్వం ఆమోదించిన బిల్లులపై ఆలస్యాలు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతాయని న్యాయస్థానం సూచించింది. మొత్తానికి, రాష్ట్రపతి–గవర్నర్ల అధికారాలు, బాధ్యతలను వివరిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న రాజ్యాంగ వ్యవస్థకు స్పష్టతను తీసుకువచ్చింది. రాష్ట్రాలు, కేంద్రం, రాజ్యాంగాధికారులు మధ్య సంబంధాలు మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -