end
=
Wednesday, November 26, 2025
వార్తలుజాతీయంఅయోధ్యలో ధ్వజారోహణతో శతాబ్దాల గాయాలు మానుకున్నాయి: ప్రధాని మోదీ
- Advertisment -

అయోధ్యలో ధ్వజారోహణతో శతాబ్దాల గాయాలు మానుకున్నాయి: ప్రధాని మోదీ

- Advertisment -
- Advertisment -

Dhwajarohan at Ayodhya : ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో(Ayodhya) మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం (Dhwajarohan at Ayodhya) జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. బాలరామాలయ శిఖరంపై ధర్మధ్వజాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ప్రధాని మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ..ధ్వజారోహణ (Dhwajarohan) కార్యక్రమం దేశానికి ఆధ్యాత్మిక పునరుజ్జీవన క్షణంగా మారిందని అన్నారు. అయోధ్య భారతీయ సంస్కృతిక చైతన్యానికి చిరస్థాయిగా నిలిచే సాక్ష్యమని పేర్కొన్నారు. “జై శ్రీరామ్” నినాదాలతో ప్రారంభమైన ఈ వేడుకలో ప్రధాని భావోద్వేగంతో నిండిన సందేశాన్ని దేశానికి అందించారు. శతాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రామభక్తుల సంకల్పం నేడు ఫలించిందని అన్నారు.

కోట్లాది భారతీయుల కల నిజమైన ఈ దినోత్సవం, వేలఏళ్ల సంస్కృతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాల నాటి బాధలు, గాయాలు నేటి ఈ పవిత్ర వేడుకతో నయం అయ్యాయి. 500 ఏళ్లుగా కొనసాగిన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ ఆలయ నిర్మాణం కోసం పని చేసిన ప్రతి వ్యక్తికీ హృదయపూర్వక నమస్కారాలు అంటూ మోదీ అభినందనలు తెలిపారు. ధర్మధ్వజం కేవలం ఒక జెండా కాదని, అది భారతీయ మౌలిక సంస్కృతికి ప్రతీక అని ప్రధాని వివరించారు. ఈ జెండా భారతీయుల సంకల్పబలానికి, సఫలతా స్పూర్తికి చిహ్నంగా నిలుస్తుందని చెప్పారు. శ్రీరాముడి ఆలోచనలు, ఆయన చూపిన ధార్మిక మార్గం ఈ ధ్వజం ద్వారా ప్రపంచానికి మరింత స్పష్టంగా చేరుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ధర్మధ్వజం మన కర్మ, మన కర్తవ్యాల ప్రాధాన్యతను స్మరింపజేస్తుంది. ఇది కేవలం దైవచిహ్నం కాదు, మన జీవనపథానికి దిశానిర్దేశం అని ఆయన వివరించారు.

సమాజంలో పేదరికం, బాధలు లేకుండా ప్రతి ఒక్కరూ సుఖంగా జీవించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ప్రధాని తెలిపారు. ధర్మధ్వజం దూరం నుంచి దర్శించినా రాముని దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఆయన అన్నారు. అయోధ్య మనకు ఒక వ్యక్తి పురుషోత్తముడి స్థాయికి ఎలా ఎదగగలడో చూపించిన పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. రాముడు ఎప్పుడూ కులం, వర్గం చూడక భక్తిని మాత్రమే గుర్తించే దేవుడని మోదీ స్పష్టం చేశారు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన పురాణ ఇటిహాసాల ప్రకాశవంతమైన వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ వేడుక కేవలం ధ్వజారోహణం కాదు, భారతీయ ఆధ్యాత్మికతకు, భక్తికీ, చారిత్రకతకు చారిత్రాత్మకాన నూతన అధ్యాయం అని ప్రధాని మోదీ అన్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -