end
=
Friday, December 26, 2025
వార్తలుజాతీయంరైలు ప్రయాణికులకు మరో దెబ్బ: పెరిగిన ఛార్జీలు నేటి నుండి అమల్లోకి
- Advertisment -

రైలు ప్రయాణికులకు మరో దెబ్బ: పెరిగిన ఛార్జీలు నేటి నుండి అమల్లోకి

- Advertisment -
- Advertisment -

Indian Railways: దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికుల(Train passengers)పై కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరోసారి ఆర్థిక భారం మోపింది. రైల్వే శాఖ( Railway Department) ఇటీవల ప్రకటించిన కొత్త టికెట్ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జూలైలో ఒకసారి ఛార్జీలు పెంచిన రైల్వే అధికారులు, కేవలం ఐదు నెలల వ్యవధిలోనే మరోసారి ధరల సవరణకు పూనుకోవడం ప్రయాణికుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా నిత్యం రైళ్లపై ఆధారపడే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు ఈ నిర్ణయం గణనీయమైన ప్రభావం చూపనుంది. పెరిగిన ఛార్జీల ప్రభావం మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఏసీ క్లాసులకే పరిమితం కాకుండా, 215 కిలోమీటర్లకు మించిన దూరం ప్రయాణించే ఆర్డినరీ నాన్-ఏసీ ప్రయాణికులపై కూడా పడనుంది. ఇప్పటివరకు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చన్న భావన ఉన్న ఈ సాధారణ రైళ్లు కూడా ఇకపై ఖరీదైనవిగా మారనున్నాయి.

అయితే, సబర్బన్ లేదా లోకల్ రైళ్లు, అలాగే సీజన్ టికెట్లను ఈ పెంపు నుంచి పూర్తిగా మినహాయించడం కొంతమేర ఊరట కలిగించే అంశంగా మారింది. రోజూ ఉద్యోగాలు, చదువుల కోసం ప్రయాణించే వారికి ఇది ఉపశమనం కలిగించనుంది. టికెట్ ధరలు పెంచడంపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. రైల్వేల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలకే ఏటా సుమారు రూ.1.15 లక్షల కోట్లు, పెన్షన్లకు మరో రూ.60 వేల కోట్ల వరకు ఖర్చవుతోందని తెలిపింది. ఈ భారాన్ని సమతుల్యం చేసుకునేందుకు ‘ఛార్జీల హేతుబద్ధీకరణ’ అవసరమైందని అధికారులు పేర్కొన్నారు. తాజా ధరల పెంపు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికులపై అనవసరమైన భారం పడకుండా, రైల్వేల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికీ రైలు టికెట్ ధరలో దాదాపు 50 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని రైల్వే శాఖ గుర్తు చేసింది.

అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, “మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. బడ్జెట్‌కు ముందే, పార్లమెంటులో చర్చ లేకుండా టికెట్ ధరలు పెంచడం ప్రజాస్వామ్య విరుద్ధం” అని విమర్శించారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను రద్దు చేయడం వల్ల జవాబుదారీతనం తగ్గిపోయిందని ఆయన ఆరోపించారు. రైల్వే భద్రతపై కూడా కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. అత్యంత ప్రాధాన్యంగా ప్రచారం చేసిన ‘కవచ్’ భద్రతా వ్యవస్థ దేశంలోని కేవలం 3 శాతం రైలు మార్గాల్లోనే అమలులో ఉందని, ఇది వాస్తవ ప్రయోజనం కంటే ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. సాధారణ ప్రయాణికుల ప్రయాణం రోజురోజుకు “నరకప్రాయంగా” మారుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం రాజకీయ వేడిని మరింత పెంచింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -