end
=
Wednesday, December 31, 2025
వార్తలురాష్ట్రీయంట్రాన్స్‌జెండర్ల సాధికారతకు తెలంగాణ సర్కార్ కీలక అడుగు
- Advertisment -

ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు తెలంగాణ సర్కార్ కీలక అడుగు

- Advertisment -
- Advertisment -

Telangana: తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని కేంద్రబిందువుగా పెట్టుకుని పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy government) మరో సమాజహిత నిర్ణయంతో ముందుకు వచ్చింది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు (Transgenders) (హిజ్రాలు) గౌరవప్రదంగా జీవిస్తూ, ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయాలనే లక్ష్యంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ట్రాన్స్‌జెండర్లకు 100 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు పెంచడం, వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడం. అర్హులైన లబ్ధిదారులకు గరిష్టంగా రూ.75,000 వరకు రుణం మంజూరు చేయనున్నారు. ఇది పూర్తిగా సబ్సిడీ కావడంతో, మంజూరైన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

చిన్న వ్యాపారాలు, సేవా రంగం, వృత్తి ఆధారిత పనులు మొదలుపెట్టాలనుకునే వారికి ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.ఏదైనా రంగంలో నైపుణ్య శిక్షణ పొందినవారు లేదా స్వయంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న ట్రాన్స్‌జెండర్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు అర్హులని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్‌జెండర్లలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు, సమాజంలో వారికి ఆర్థిక భద్రత కూడా లభించనుంది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పథకం కింద ప్రభుత్వం 30 స్వయం ఉపాధి యూనిట్లను కేటాయించింది.

ఆసక్తి గల అభ్యర్థులు నాంపల్లి ప్రాంతంలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న సంబంధిత కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. దరఖాస్తులు జనవరి 31వ తేదీ లోపు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. మరిన్ని వివరాల కోసం 9640452773 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త ఆశలు నింపే కీలక మలుపుగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -