- బౌలర్‌ను వేదిస్తోన్న వెన్నునొప్పి గాయం
- ఆరు నెలల విశ్రాంతి కావాలన్న వైద్యులు
- భారత్‌ను వెంటాడుతున్న గాయల బెడద
Jasprit Bumrah : ఆస్ట్రేలియాలో (Australia) జరగబోయే 2022 టీ20 ప్రపంచకప్‌కు (T20 world cup) ముందు టీమిండియాకు (India) పెద్ద ఎదురుదెబ్బపడింది. భారత బౌలింగ్ మెయిన్ ప్లేయర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెన్నునొప్పి గాయం తిరగబెట్టడంతో ప్రంపంచకప్ టోర్ని (world cup) నుంచి తప్పకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన బుమ్రా.. అత్యంత కీలకమైన టీ20 వరల్డ్‌క్‌పలో సైతం ఆడే అవకాశం లేదని, ప్రస్తుతం అతడికి ఆరు నెలల విశ్రాంతి (rest) అవసరమని చెబుతున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రా దుమ్ము రేపుతాడనుకున్న అభిమానులకు ఇది నిజంగా నిరాశే మిగిలేలా కనిపిస్తోంది.
(Cricket: టీమిండియా సారథి రోహిత్ శర్మ)
అయితే ఇప్పటికే రవీంద్ర జడేజా (Ravindra jadeja) గైర్హాజరీ కాగా.. వీరిద్దరూ లేకపోవడం భారత్ అవకాశాలపై ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టీ20 వరల్డ్‌కప్ కోసం బుమ్రా ఆసీస్‌కు వెళ్లడం లేదు. అతడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. కోలుకునేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం తను జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. జట్టు ప్రధాన బౌలర్‌గా ఉన్న అతడిని ఇలాంటి పరిస్థితిలో ఆడించి రిస్క్ తీసుకోలేం. మరోవైపు మెగా టోర్నీకి ముందే జడేజా, బుమ్రా సేవలను కోల్పోవడం జట్టుకు గట్టి దెబ్బే. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు’ అని బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారి తెలిపాడు.
ఈ మేరకు దక్షిణాఫ్రికాతో (South Africa) సిరీస్‌కు బుమ్రా స్థానంలో హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌ను (Mohd. Siraj replaces injured Jasprit Bumrah) తీసుకునే అవకాశం ఉండగా.. టీ20 ప్రపంచకప్‌నకు స్టాండ్‌బై పేసర్లుగా షమి, దీపక్ చాహర్‌లను ఇదివరకే బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా దూరమవడంతో అతడి స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. ఆసీస్‌తో సిరీస్‌కు ముందే షమి కొవిడ్ బారిన పడి రెండు సిరీస్‌లకు దూరమయ్యాడు. దీంతో అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. అటు చాహర్ సఫారీలతో తొలి టీ20లో అదరగొట్టాడు. పవర్‌ప్లేలో వికెట్ తీసే సామర్థ్యంతో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి చాహర్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపవచ్చు. ఐసీసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్టోబరు 15 వరకు జట్టులో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది.
దక్షిణాఫ్రికాతో (South Africa) రెండో టీ 20 భారత జట్టు:(India squad for South Africa T20) రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్, మొహమ్మద్ సిరాజ్.