వరంగల్ సమీపం (Near Warangal)లోని మామునూరు (Mamunuru Village)లో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు (Brown Field Airport) నిర్మాణానికి కేంద్రం కొన్నినెలల క్రితం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) కూడా చొరవ చూపిస్తుంది. దీనిలో భాగంగా తాజాగా కీలకమైన ముందడుగు వేసింది. భూసేకరణ కోసం (Land Acquisition) తాజాగా రూ.205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం రూ.205 కోట్లను విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఈ ఏడాది మార్చిలో విమానాశ్రయానికి అనుమతి ప్రకటించి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి బాధ్యతలు అప్పగించారు.
మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే నిర్మాణానికి శ్రీకారం చుడతామని కేంద్రం వెల్లడించింది. దీనితో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడంతోపాటు, నిధుల విడుదల ద్వారా ప్రాజెక్టు ముందుకు కదులనున్నది. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగ్గా ఉండనున్నాయి.