end
=
Thursday, May 16, 2024
వార్తలురాష్ట్రీయంవంట నూనె ధరల్ని తగ్గించబోతుందా...
- Advertisment -

వంట నూనె ధరల్ని తగ్గించబోతుందా…

- Advertisment -
- Advertisment -

వంట నూనెల ధరలు మరింత దిగిరాబోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు లీటర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గింది. ఇంకో రూ.15 తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సామాన్య ప్రజలకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వంట నూనెల ధరల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. లీటర్ నూనెపై వెంటనే రూ.15 తగ్గించాలని వంట నూనెలు తయారు చేసే కంపెనీలను కూడా ఆదేశించింది. లీటర్‌పై గరిష్ట రిటైల్ ధర రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్స్‌ని ఆదేశించింది. జులై 6న ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీలతో ఆహార, ప్రజాపంపిణీ శాఖ జరిపిన సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కోరిన సంగతి తెలిసిందే. ధరల్ని వెంటనే తగ్గించాలని ఆదేశిస్తూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

వంటనూనెల ధరలను తక్షణమే తగ్గించి, ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని, మరియు రిఫైనర్‌లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. తయారీదారులు, నూనెను శుద్ధి చేసేవారు పంపిణీదారులకు ధరల్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందించాలని, ఇది ఒక క్రమ పద్ధతిలో జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జూన్ నెలలో గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ ధరలు టన్నుకు USD 300-450 తగ్గిన సంగతి తెలిసిందే. కాబట్టి దేశీయంగా వంట నూనెల ధరల్ని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. భారతదేశం తన వార్షిక ఎడిబుల్ ఆయిల్ డిమాండ్‌లో దాదాపు 56 శాతం దిగుమతులే ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆహార చమురు ధరలు పెరిగినప్పుడు భారతదేశంలో ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో భారతదేశంలో కూడా ధరలు తగ్గబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీరోజూ వంటనూనెల ధరల్ని పర్యవేక్షిస్తోంది. వంటనూనెల ధరల్ని అదుపు చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -