end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయందేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు
- Advertisment -

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

- Advertisment -
- Advertisment -

ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే

కరోనా పాజిటివ్‌ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే రికవరీ రేటు కూడా ఆశాజనకంగా ఉంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త 38,310 మందికి కరోనా సోకగా దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి పెరిగింది. అయితే గడిచిన 24 గంట‌ల్లోనే దేశంలో 490 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,23,097కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,41,405కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌బులిటిన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 76,03,121గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 58,323 మంది వైర‌స్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ఏదేమైనా దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ జరుగుతుండడంతో ప్రజల కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, శానిటైజేషన్‌, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యం.

లాక్‌డౌన్‌ దిశగా యూరప్‌ దేశాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -