తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంసెంబ్లీలో నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్ అని తెలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్వీట్టర్‌లో ఆయన వెళ్లడించారు. తనను ఈ మధ్య కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. గత వారం రోజుల నుంచి తన వెంట ఉండే నాయకులు, కార్యకర్తలు వెంటనే టెస్టులు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆందోళన చెందకుండా డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్ ఉండాలన్నారు.
Also Read….