end
=
Saturday, November 8, 2025
రాజకీయంమొంథా తుపాను..ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా రక్షించాం: సీఎం చంద్రబాబు
- Advertisment -

మొంథా తుపాను..ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా రక్షించాం: సీఎం చంద్రబాబు

- Advertisment -
- Advertisment -

Amaravati : మొంథా తుపాను ( Montha Cyclone)ను ముందుగానే అంచనా వేసి, సమన్వయపూర్వక చర్యలతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడగలిగామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu)తెలిపారు. తుపానులో అత్యుత్తమ సేవలందించిన అధికారులకు, సిబ్బందికి సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించి, సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మొంథా తుపాను సమయంలో రాష్ట్ర యంత్రాంగం అత్యున్నత స్థాయిలో పనిచేసింది. సాంకేతికతను సమర్థంగా వినియోగించి ప్రమాదాలను నివారించగలిగాం అని అన్నారు. తుపాను హెచ్చరికలు ముందుగానే అందించడంతో ప్రజలు అప్రమత్తమయ్యారని, దాంతో పెద్ద స్థాయిలో నష్టం జరగలేదని పేర్కొన్నారు. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్‌ సాయంతో గుర్తించి విజయవంతంగా రక్షించాం. అదే విధంగా ఒక ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు పెరగడంతో చిక్కుకుపోయిన 15 మందిని సకాలంలో కాపాడాం. అధికారులు, స్వచ్ఛంద సిబ్బంది నిరంతరం పని చేస్తూ, నీటిని తొలగించే పనులను వేగంగా పూర్తి చేశారు అని తెలిపారు.

తన ప్రసంగంలో సీఎం రాష్ట్రానికి ఎదురయ్యే రెండు ప్రధాన సవాళ్లను ప్రస్తావించారు. రాయలసీమలో కరవు, కోస్తాంధ్రలో తుపాన్లు. రాయలసీమలో కరవు సమస్యను సమర్థ నీటి నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణంతో అధిగమించాం. ఇప్పుడు కోస్తాంధ్రలో తుపాన్లను కూడా అదే విధంగా సాంకేతిక ఆధారిత పద్ధతులతో ఎదుర్కొంటున్నాం అని చెప్పారు. మొంథా తుపాను నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి సాంకేతిక సహాయం అందించామని తెలిపారు. ప్రతి గంటా పరిస్థితిని రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించి, వర్షపాతం, గాలుల తీవ్రతపై నిరంతర విశ్లేషణ జరిపాం. అవసరమైన చోట్ల ముందస్తు హెచ్చరికలు పంపించాం. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేశాయి. ఈ సమగ్ర కృషితో ప్రాణనష్టం, ఆస్తినష్టం లేకుండా తుపానును ఎదుర్కొనగలిగాం అని సీఎం గర్వంగా వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం తుపాన్ల నిర్వహణలో సాంకేతికత ప్రాధాన్యాన్ని మరింతగా పెంచేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా డ్రోన్లు, ఉపగ్రహ డేటా, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్స్‌ వినియోగంతో మరింత సమర్థవంతంగా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే వ్యూహాలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యం. ప్రతి తుపాను, ప్రతి విపత్తు మాకు ఒక పాఠం. దాన్నుంచి నేర్చుకుని, రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా చేయడం మన లక్ష్యం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

 

 

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -