end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీSun:సూర్యుడు నిద్రపోతాడని తెలుసా?
- Advertisment -

Sun:సూర్యుడు నిద్రపోతాడని తెలుసా?

- Advertisment -
- Advertisment -

  • ఆసక్తికర విషయాలు వెల్లడించిన భారతీయ పరిశోధకులు
  • నిద్రపోయే సమయంలోనూ పనిచేస్తూనే ఉంటాడని రుజువు

ప్రపంచానికంతటికీ వెలుగునిచ్చే సూర్యుడు (sun) నిద్రపోతే (sleeping)ఏం జరుగుతుందో భారతీయ పరిశోధకులు (indian Researchers) కనుగొన్నారు. ఈ ఏడాది తన సౌరచక్రం (solar cycle)లో గరిష్ట స్థాయికి చేరుకున్నందున చాలా చురుగ్గా ఉన్న సూర్యుడు.. గత పది రోజుల్లో (10 days) మూడు సౌర మంటలను, 18 కరోనల్ మాస్ ఎజెక్షన్లు (Coronal mass ejections) సహా 1 భూ అయస్కాంత తుఫాన్‌ (Magnetic storm)ను ఉత్పత్తి (product) చేశాడు. అయితే మండుతున్న సూర్యుడు ఎప్పుడు నిద్రిస్తాడు? సూర్యునిపై ఎటువంటి కార్యాచరణ లేనప్పుడు ఏం జరుగుతుందో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (Center of Excellence in Space Science and Indian Institute of Science Education and Research) ‘IISER’ పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు సూర్యుడు తన శక్తిని తిరిగి ఎలా పొందగలడో కూడా వారు తెలుసుకున్నారు.

సూర్యుడు నిద్రిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది?

సూర్యుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు కూడా మన సౌర వ్యవస్థలోని కేంద్ర నక్షత్రం (stars) యొక్క ధ్రువ, అంతర్గత ప్రాంతాల్లో విషయాలు ఎప్పటిలాగే జరుగుతాయని శాస్త్రవేత్తలు (scientist)కనుగొన్నారు. నిశ్శబ్ద సమయాల్లో కూడా సూర్యుడి అంతర్గత డైనమో మెకానిజం (Internal dynamo mechanism) (దాని సౌర చక్రానికి బాధ్యత వహిస్తుంది) పనిచేస్తూనే ఉంటుంది. సూర్యుడు సౌర వ్యవస్థలోని కేంద్ర నక్షత్రం నుంచి విరామం తీసుకున్నప్పుడల్లా, దానికి ఎలాంటి సన్‌ స్పాట్స్ (son spots) ఉండవు. ఈ కాలాన్ని ‘గ్రాండ్ మినిమమ్’ (‘Grand Minimum’) అంటారు. సూర్యుని 4.6-బిలియన్ సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో, ఇటువంటి సంఘటనలు (events) చాలాసార్లు జరిగాయి.

(Ozone Layer: ఓజోన్ పొర రంధ్రం మూయడానికి 50 ఏళ్లు పడుతుంది!!!)

మొత్తానికి సూర్యుని అంతర్భాగంలోని అయస్కాంత క్షేత్రాలు నిద్రపోయే సమయాల్లో కూడా పనిచేస్తూనే ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. ఈ చర్య సన్‌ స్పాట్స్‌ను ఉత్పత్తి చేయలేని ఉష్ణప్రసరణ జోన్‌లో (zone)బలహీనమైన చక్రాల రూపంలో జరుగుతుంది. ఇలాంటి అధ్యయనాలతో మన కేంద్ర నక్షత్రమైన సూర్యుని గురించి మరింతగా కనుగొనగలుగుతాం. కాగా ఈ అధ్యయనంలో కనుగొన్న విషయాలు రాయల్ ఆస్ట్రోనామికల్ (Royal Astronomical) సొసైటీ మంత్లీ జర్నల్‌ (Society’s Monthly Journal)లో ప్రచురించబడ్డాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -