end
=
Wednesday, May 15, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీWhatsapp:వాట్సాప్‌‌లో ప్రతి మెసేజ్‌కు రిప్లయ్ ఇస్తున్నారా?
- Advertisment -

Whatsapp:వాట్సాప్‌‌లో ప్రతి మెసేజ్‌కు రిప్లయ్ ఇస్తున్నారా?

- Advertisment -
- Advertisment -

  • యూజర్స్ పర్సనాలిటీ స్టడీపై ఆసక్తికర ఫలితాలు
  • మెసేజెస్‌కు ఇచ్చే రిప్లయ్‌ ద్వారా వ్యక్తిత్వ అంచనా
  • దేశవ్యాప్తంగా వంద మంది వాట్సాప్ యూజర్లతో సర్వే
  • 26 % మందిలో ‘రెస్పాన్సిబుల్ ఫ్యాక్ట్ చెకర్’ వ్యక్తిత్వం 
  • లింగోస్ అర్థంచేసుకోవడంలో 61% ఇండియన్స్ వెనకంజ

ప్రతిరోజు వాట్సాప్ (WhatsApp) ద్వారా ప్రపంచవ్యాప్తంగా  (World wide) బిలియన్ల (Billions) కొద్దీ సందేశాలు (messages) మార్పిడి చేయబడతాయి. అయితే ప్రతి ఒక్కరు ఆయా సందేశాలకు తమ లక్షణాలను (characteristics) బట్టి వ్యక్తిగతంగా ప్రతిస్పందిస్తారని (responds), బహుశా ఇవన్నీ వారి ‘వాట్సాప్ పర్సనాలిటీ’ (whatsapp personality)ద్వారా నడపబడతాయని తాజా సర్వేలో (research)వెల్లడైంది. ఒక స్వతంత్ర ఏజెన్సీ సెప్టెంబర్-అక్టోబర్ (sep- oct)మధ్య నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మీరు యాక్టివ్‌‌గా (active)ఉంటారా? ప్రతి మెసేజ్‌కు వెంటనే రిప్లయ్ (replay) ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటూ వాట్సాప్‌కు అతిగా కనెక్ట్ (connect)అయిన వ్యక్తులా? లేదా ప్రతి పరిస్థితికి ఒక మీమ్‌ (meme)ను వెతుక్కునేవారా? వంటి వ్యక్తిత్వ లక్షణాలను ఈ సర్వే ఫలితాలు (result) వివరించాయి.

(వాట్సాప్ ఛాట్‌బోట్ ద్వారా ఉబర్‌ రైడ్‌)

భారతదేశంలోని 14 నగరాలకు చెందిన దాదాపు 100 మంది సాధారణ వాట్సాప్ వినియోగదారులతో కంపెనీ మాట్లాడింది. వారిలో ఎక్కువ మంది 20 నుంచి 30 మధ్య వయసు గలవారు కాగా.. వయో పరిధి 15 నుంచి 60. కాగా 1950sలో కార్డియాలజిస్టులు (Cardiologists) మేయర్ ఫ్రైడ్‌మాన్ (Mayor Friedman), రే రోసెన్‌మాన్ (Ray Rosenman)అభివృద్ధి చేసిన ‘ఫ్రైడ్‌మ్యాన్ అండ్ రోసెన్‌మాన్ పర్సనాలిటీ-టైప్’ (‘Friedman and Rosenman Personality-Type’) రీసెర్చ్ నుంచి ప్రేరణ పొంది ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రవర్తన గురించి కనుగొన్న విషయాలు కింద ఇవ్వబడ్డాయి.

మొదట ‘టైప్ A’కు చెందినవారు మరింత పోటీతత్వాన్ని కలిగి అత్యంత వ్యవస్థీకృతంగా, ప్రతిష్టాత్మకంగా ఉంటారు. అసహనంతో దూకుడుగా ఉండటమేకాక వారికి సమయ నిర్వహణ గురించి బాగా తెలుసు.

* రెస్పాన్సిబుల్ ఫ్యాక్ట్-చెకర్ :

ఏవైనా మెసేజెస్ ఫార్వార్డ్ (foword) చేసే ముందు తమకు ఫార్వార్డ్ చేయబడిన సందేశాల వాస్తవాలను ఎప్పుడూ తనిఖీ చేసేవారు.

* అతిగా కనెక్ట్ చేయబడిన మెసేజర్ :

 ఎప్పుడూ యాక్టివ్‌‌గా ఉంటూ వాయిస్ నోట్స్, వీడియో కాల్స్ (video calls)ఉపయోగిస్తారు. వాట్సాప్‌లో రెస్పాండ్ కావడానికి, చదవడానికి, ప్రతిస్పందించడానికి ‘Always on’ స్థితిలో ఉంటారు.

* గ్రూప్-మేకర్ :

 ప్రతి ప్రత్యేక సందర్భంలో ‘మిమ్మల్ని ఆశీర్వదించండి!’ అని చెప్పడానికి ఈ యూజర్ ఒక గ్రూప్ (group) తయారు చేస్తాడు.

* ఫాస్టెస్ట్ ఫింగర్ :

మెరుపు వేగంతో టైప్ చేస్తారు. రిసీవర్ మొదటి ప్రశ్నకు లేదా కామెంట్‌కు (comment) రిప్లయ్ ఇచ్చే సమయానికి వారు ఎనిమిదో స్థానంలో ఉంటారు.

* ఆందోళనకారుడు :

నిశ్శబ్దంగా ఉన్న గ్రూప్‌లోకి ఏదో ఒక ఆటంకం కలిగించే న్యూస్‌తో (news)ఎంటర్ అవుతారు.

* గురువు-బోధకుడు :

ప్రతి ఒక్కరికీ ప్రతి విషయంలో ‘జ్ఞానం’ అందిస్తారు. బహుశా సంబంధిత సబ్జెక్ట్‌ మ్యాటర్‌లో (subject mtter)నిపుణుడా? లేదా నిజమైన (teacher)పండితుడా? చెప్పడం కష్టం.

టైప్ B వ్యక్తులు మరింత రిలాక్స్‌గా, విషయాలను క్షుణ్ణంగా గ్రహించే వ్యక్తిత్వాలు :

* డిఫ్యూజర్ :

ముఖ్యంగా విషయాలు వేడెక్కుతున్నప్పుడు లేదా వివాదాస్పదంగా మారినప్పుడు సంభాషణలను తేలికగా, సరదాగా మలచగలిగే నేర్పు ఉంటుంది.

* స్లీపింగ్ పార్టనర్:

గ్రూప్స్‌లో ఉన్నపటికీ దాదాపు ఎప్పుడూ ప్రతిస్పందించరు లేదా గ్రూప్‌లో ఒక భాగంగా కొనసాగే మటుకు స్పందిస్తారు.

* ఫొటో-వీడియో స్టూడియో :

 ఈ తరహా వ్యక్తుల దేన్నయినా ఛాయాచిత్రాలు, వీడియోలతో వ్యక్తీకరిస్తారు. ప్రతిదీ ఫొటోగ్రాఫ్స్ లేదా వీడియోల ద్వారా భాగస్వామ్యం చేయబడుతుంది లేదా ప్రతిస్పందించబడుతుంది.

* సీరియల్ మీమర్ :

ప్రతి జీవిత పరిస్థితికి ఒక మీమ్ ఉంటుంది(సంతోషంగా, ఫన్నీగా, వ్యంగ్యంగా, సాహసోపేతంగా).

* ఎమోజి క్వీన్ :

మోజీస్, ‘రియాక్జీస్’(ఎమోజీ రియాక్షన్స్ అని కూడా పిలుస్తారు) ద్వారా మాత్రమే ప్రతిస్పందిస్తారు. ఇది వారి శక్తి, సమయం, పదాలను ఆదా చేస్తుంది. లేదా వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేయడానికి దీన్ని ఒక సురక్షిత, సులభతర, వేగవంతమైన మార్గంగా భావించవచ్చు.

* ‘గుడ్ మార్నింగ్’ మెసేజర్ :

ప్రతి ఉదయం తప్పకుండా “గుడ్ మార్నింగ్” కోట్, మీమ్, మెసేజ్ లేదా GIF ఉంటుంది.

అయితే దాదాపు 26% మంది యూజర్లు తాము ‘రెస్పాన్సిబుల్ ఫ్యాక్ట్ చెకర్’ వ్యక్తిత్వాన్ని గుర్తించినట్లు చెప్పారు(ఫార్వార్డ్ చేసిన సందేశాల గురించి, ముఖ్యంగా నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం గురించి జాగ్రత్తపడుతున్నవారు). కానీ 22% మంది మాత్రం తాము ‘అతిగా కనెక్ట్ అయిన మెసేజర్’గా చెప్పారు.

ఈ ప్రత్యేకమైన వాయిస్‌లు యూజర్ల సొంత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. వాట్సాప్ మనకు కావలసిన విధంగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది  మనం కోరుకున్నట్లుగా ప్రతిస్పందించడానికి సమయం ఇస్తుంది. ప్రతిస్పందించడానికి తగిన పదాలు, శక్తి లేదా వాగ్ధాటిని కలిగి లేనప్పుడు ఆ వాక్యూమ్‌ను అనేక రకాల ఎమోజీలు, రియాక్‌జీస్‌తో వాట్సాప్ ఫిల్ చేస్తుంది. మొత్తం మీద వాట్సాప్‌ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకమైన వాయిస్‌ కనుగొన్నారు. ఇది వారి సొంత వ్యక్తిత్వానికి పొడిగింపుగా ఉంటుంది.

(ఇన్‌స్టాగ్రామ్‌ లో సరికొత్త ఫీచర్‌)

– మేఘనా ముఖర్జీ, సైకోథెరపిస్ట్

కానీ Gen Z, మిలీనియల్స్‌కు పర్యాయపదంగా మారిన ఎమోజి, మీమ్ లేదా భాషను అర్థం చేసుకోవడం ప్రతి వినియోగదారుకు సులభం కాదు. లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్, యాప్ అయిన ‘డ్యుయోలింగో’ ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన సర్వేలో 40 ఏళ్లు పైబడిన భారతీయుల్లో 61%కి పైగా Gen Z, మిలీనియల్స్.. ‘iykyk(if you know you know), “FOMO” (fear of missing out) లేదా ‘sus(short for suspect) వంటి లింగోలను అర్థం చేసుకునేందుకు దూరంగా ఉన్నారని కనుగొన్నారు. Gen X(42-57 సంవత్సరాలు), బేబీ బూమర్స్(58-76 సంవత్సరాలు), ‘సైలెంట్ జనరేషన్(77-94 సంవత్సరాలు)’కు చెందిన 84% మంది భారతీయులు ఆధునిక పదజాలాన్ని ఉపయోగించడం కష్టమని చెప్పారు. దేశవ్యాప్తంగా 1,019 మంది భారతీయ ప్రతివాదులతో అంతర్జాతీయ డేటా, అనలిటిక్స్ గ్రూప్ YouGov ఈ సర్వే కోసం పరిశోధన నిర్వహించింది.

ప్రతివాదులు 16% మంది మాత్రమే కొత్త-యుగం పరిభాషను సులభంగా అర్థం చేసుకోగలిగారు. కానీ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. Gen X,  బేబీ బూమర్స్ ‘lit(కూల్ లేదా ఎగ్జైటింగ్)’, ‘lol(laughing out loud)’ వంటి సరళమైన పదాలతో తమను తాము పరిచయం చేసుకున్నట్లు అనిపిస్తుంది. Duolingo సర్వేలో సగానికి పైగా (52%) ప్రతివాదులకు ‘lol’ అంటే ఏమిటో తెలుసు కానీ 23% మంది ప్రతివాదులకు మాత్రమే ‘lit’కు సరైన అర్థం తెలిసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -