end
=
Wednesday, October 29, 2025
వార్తలుజాతీయంఆర్జేడీ ఆట‌విక పాల‌న వ‌ద్దు.. ఎన్డీయే కూట‌మిని గెలిపించండి: అమిత్ షా
- Advertisment -

ఆర్జేడీ ఆట‌విక పాల‌న వ‌ద్దు.. ఎన్డీయే కూట‌మిని గెలిపించండి: అమిత్ షా

- Advertisment -
- Advertisment -

Union Home Minister Amit Shah : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల (Bihar Assembly elections ) ప్ర‌చారం జోరుగా సాగుతున్న‌ది. మ‌హాఘ‌ట్బంధ‌న్ కూట‌మి(Mahaghatbandhan alliance), ఎన్డీయే కూట‌మి పోటా పోటీగా ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్డీయే కూట‌మి (NDA alliance) త‌ర‌ఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శ‌నివారం బీహార్‌షరీఫ్, ముంగేర్‌లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఆర్జేడీ పాలనలో మళ్లీ కిడ్నాప్‌లు, బెదిరింపులు, దోపిడీ, అవినీతి రాజ్యం, ఆటవిక పాలన కావాలా? లేక జేడీయూ అధినేత నితీశ్ సీఎం అయిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వం కలిసి చేపట్టే అభివృద్ధి కావాలా? అని బీహార్‌ ప్రజలను ప్రశ్నించారు. బీహార్‌లోని నలంద జిల్లా శనివారం నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Election campaign)లో ఆయన ఆర్జేడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చొరబాటుదారులకు అండగా నిలవాలని చూస్తున్నారని అమిత్‌షా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ చేపడితే, కాంగ్రెస్ దానిని వ్యతిరేకించిందని గుర్తుచేశారు. అయితే, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో చొరబాటుదారుడిని గుర్తించి, వారి స్వదేశానికి తరలిస్తామని ప్రకటించారు. చొరబాటుదారులను వారి దేశాలకు పంపకుండా ఏ శక్తీ ఆపలేదని ఆయన నొక్కిచెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కేవలం తన కుటుంబ ప్రయోజనాలనే చూసుకున్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్జేడీ రాష్ట్రాన్ని పాలించిన రోజుల్లో పారిశ్రామిక రంగం కుదేలయిందన్నారు. నాడు మాఫియా ముఠాలు కాంట్రాక్ట్ హత్యలకు, ప్రజల ఆస్తుల కబ్జాకు పాల్పడేవని ధ్వజమెత్తారు.

ఒకే దశలో పోలింగ్

ఎన్డీయే వచ్చిన తర్వాతే బీహార్ నక్సల్ విముక్త రాష్ట్రమైందని, సీఎంగా నితీశ్‌కుమార్ సుపరిపాలనతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని అమిత్ షా ప్రశంసించారు. గతంలో శాంతిభద్రతల సమస్య కారణంగా అనేక విడతల్లో పోలింగ్ జరిగేదని, ఇప్పుడు రెండు దశల్లోనే పూర్తి చేసే ప్రశాంత వాతావరణం వచ్చిందని కొనియాడారు. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఒక్క దశలోనే జరుగుతాయని జోస్యం చెప్పారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -