తమన్నా భాటియా (Tamanna Bhatia) బాలీవుడ్ (Tollywood) టు టాలీవుడ్ (Bollywood) వరకు నటనలో ఆమె తన ప్రతిభ చూపారు. ప్రేక్షకులు (Audience) ఆమె నటనకు, అందానికి ఫిదా అయినప్పటికీ, కొన్నాళ్లుగా ఆమె ఒడిదొడుకులు (Up and Downs) ఎదుర్కొంటున్నారు. తొలిరోజుల్లో ఒక రేంజ్ చూసిన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings)లో కాస్త వెనుకబడ్డారు.
ఎందుకంటే, తమన్నాకు గతంలోలాగా పెద్దగా సినిమా అవకాశాలేవీ వస్తున్నట్టు కనిపించడం లేదు. కొన్ని చిన్న సినిమాల్లో నటించినప్పటికీ, అవి కూడా ఆమెకు కలిసి రావడం లేదు. అయితే, పెద్ద సినిమాల్లో అవకాశాలు అంటే.. అడపా దడపా ఐటం సాంగ్స్ ఆమెను వరిస్తున్నాయి. అది అంతవరకే.. దీంతో ఆమె కెరీర్ డౌన్ ఫాల్ అయిందని కనిపిస్తున్నది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ
ఆమెకు గతంలో మాదిరి స్టార్‌డం లేదని నెటిజన్స్ బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమ చెడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, బ్రేకప్ విషయమై ఇప్పటివరకు వీరిద్దరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉండగా, తాజాగా తమన్నా సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
కొన్ని తన రెగ్యులర్ డే ఫోటోలు, వీడియోలను తమన్నా షేర్ చేసి, నోట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు రాసుకొచ్చింది. “ప్రస్తుతం నేను గుర్తించే దశలో ఉన్నాను. సగం డిజైనర్, సగం డిటెక్టివ్‌గా ఉన్నానేమో అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతీది చాలా ముఖ్యం. అంతేకాకుండా ప్రతి తప్పూ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని రాసుకొచ్చారు.