end
=
Wednesday, May 15, 2024
క్రీడలుFIFA World Cup 2022:నవంబర్ 20 నుంచి ‘ఫిఫా’ ప్రపంచ‌కప్
- Advertisment -

FIFA World Cup 2022:నవంబర్ 20 నుంచి ‘ఫిఫా’ ప్రపంచ‌కప్

- Advertisment -
- Advertisment -

  • ఖతర్ వేదికగా మొదలవనున్న ‘ఫుట్‌బాల్’ సంగ్రామం
  • డిసెంబర్ 18 వరకు జరిగే టోర్నీలో పాల్గొంటున్న 32 జట్లు
  • గోల్డెన్ బూట్ దక్కించుకున్న లక్కీ ప్లేయర్స్ వీరే

FIFA World Cup 2022: క్రికెట్ ప్రపంచకప్ ముగిసిన వారం రోజులకే మరో మహా సంగ్రామానికి తెర లేవనుంది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ గేమ్ ఫుట్ బాల్(Football). ఖతర్ (Qatar) వేదికగా నవంబర్ 20న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (Fifa World Cup 2022) ఆరంభంకానుంది. డిసెంబర్ 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. క్రికెట్ ప్రపంచకప్‌లో కేవలం16 జట్లు (teams)మాత్రమే పాల్గొంటే.. ఫుట్ బాల్ విశ్వ సంగ్రామంలో అందుకు రెట్టింపు అంటే 32 జట్లు తలపడనున్నాయి. ప్రపంచ ఛాంపియన్‌లుగా (Champions)నిలిచేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ 32 జట్లు ఖతార్‌లో పోటీ పడబోతున్నాయి. ఈ పెద్ద టోర్నమెంట్‌లో (Tournament)ఓ కీలక అవార్డు కూడా ఇస్తుంటారు. దీని పేరు గోల్డెన్ బూట్ (Golden Boot). ఫిఫా ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌కు ఈ అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు అధికారికంగా 1982 ప్రపంచ కప్‌లో ప్రారంభమైంది. ఈ అవార్డును 2006 ప్రపంచకప్ వరకు గోల్డెన్ షూగా (Golden shoe) పిలిచేవారు. అయితే, 2010 నుంచి ఈ అవార్డు గోల్డెన్ బూట్‌గా మార్చారు.

(Sensation Video:అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న డ్యాన్స్)

ఫుట్ బాల్ చరిత్రలోనే తొలిసారిగా ఖతర్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 20న జరిగే తొలి మ్యాచ్ లో ఈక్వెడార్‌తో ఆతిథ్య ఖతర్ జట్టు (Qatar vs Ecuador) తలపడనుంది. ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఆడటం ఖతర్‌కు ఇదే తొలిసారి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ ప్రపంచకప్ కోసం మొత్తంగా 7 అత్యాధునిక స్టేడియాలను (Stadium) ఖతర్ నిర్మించింది. మొత్తం 32 జట్లు (Teams) ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గతేడాది యూరో కప్ చాంపియన్‌ (Euro Cup Champion)గా నిలిచిన ఇటలీ (Italy)ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం.

మెస్సీ, రొనాల్డో (Messi, Ronaldo)లకు చివరి ప్రపంచకప్

కెరీర్ చరమాంకంలో ఉన్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో (Portugal star Cristiano Ronaldo)తో పాటు అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Argentine star Lionel Messi)కి ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు రిటైర్మెంట్ (Retirement) చాలా దగ్గరగా ఉన్నారు. దాంతో వీరు తమ చివరి ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఫ్రాన్స్ (France as the defending champion) బరిలోకి దిగనుంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా బ్రెజిల్ (Brazil as the favorite for the title) బరిలోకి దిగనుంది. బ్రెజిల్‌తో పాటు ఇంగ్లండ్, స్పెయిన్, అర్జెంటీనా (England, Spain, Argentina)లు కూడా టైటిల్ ఫేవరెట్స్‌‌లో ఉన్నాయి.

మ్యాచ్ సమయాలు.. లైవ్ ఎక్కడ చూడాలి?

నవంబర్ 20న జరిగే ఆరంభ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ఆరంభం కానుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు మూడు, నాలుగు మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 3.30లకు ఒక మ్యాచ్.. సాయంత్రం గం. 6.30లకు రెండో మ్యాచ్.. రాత్రి గం. 9.30లకు మూడో మ్యాచ్.. అర్ధ రాత్రి గం. 12.30లకు నాలుగో మ్యాచ్ జరుగుతాయి. ఫైనల్ (Final) డిసెంబర్ (december)18న జరగనుంది. ఈ మ్యాచ్ లను భారత్‌లో స్పోర్ట్స్ 18 (Sports 18) చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదే సమయంలో వూట్ (Voot) యాప్ డిజిటల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

(PM MODI:చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ)

ఇక ఫిఫా ప్రపంచ‌కప్ చరిత్రలో ఇప్పటివరకు 27 మంది ఆటగాళ్లు ఈ ‘గోల్డెన్ బూట్‌’ అవార్డును అందుకున్నారు. దీన్ని సాధించడం అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే. 32 జట్లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఈ అవార్డును అందుకుంటాడు. ఆ పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..

గోల్డెన్ బూట్ అవార్డు విజేతల జాబితా..

1930 ఫిఫా ప్రపంచ కప్ – గిల్లెర్మో స్టెబిల్ (అర్జెంటీనా) – 8 గోల్స్

1934 ఫిఫా ప్రపంచ కప్ – ఓల్డెరిచ్ నెజెడ్లీ (చెకోస్లోవేకియా) 5 గోల్స్

1938 ఫిఫా ప్రపంచ కప్ – లియోనిడాస్ (బ్రెజిల్) – 7 గోల్స్

1950 ఫిఫా ప్రపంచ కప్ – అడెమిర్ (బ్రెజి) – 8 గోల్స్

1954 ఫిఫా ప్రపంచ కప్ – సాండర్ కోకాక్స్ (హంగేరి) – 11 గోల్స్

1958 ఫిఫా ప్రపంచ కప్ – జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్) – 13 గోల్స్

1962 ఫిఫా ప్రపంచ కప్ – ఫ్లోరియన్ ఆల్బర్ట్ (హంగేరీ), వాలెంటిన్ ఇవనోవ్ (రష్యా), గారించా, వావా (బ్రెజిల్), డ్రాసన్ జెర్కోవిచ్ (క్రొయేషియా), లియోనెల్ సాంచెజ్ (చిలీ) – 4 గోల్స్

1966 ఫిఫా ప్రపంచ కప్ – ఇసెబియో (పోర్చుగల్) – 9 గోల్స్

1970 ఫిఫా ప్రపంచ కప్ – గెరాడ్ ముల్లర్ (జర్మనీ) – 10 గోల్స్

1974 ఫిఫా ప్రపంచ కప్ – గ్ర్జెగోర్జ్ లాటో (పోలాండ్) – 7 గోల్స్

1978 ఫిఫా ప్రపంచ కప్ – మారియో క్యాంప్స్ (అర్జెంటీనా) – 6 గోల్స్

1982 ఫిఫా ప్రపంచ కప్ – పాలో రోస్సీ (ఇటలీ) – 6 గోల్స్

1986 ఫిఫా ప్రపంచ కప్ – గైరీ లినేకర్ (ఇంగ్లండ్) – 6 గోల్స్

1990 ఫిఫా ప్రపంచ కప్ – సాల్బేటర్ సిలాచ్చి (ఇటలీ) – 6 గోల్స్

1994 ఫిఫా ప్రపంచ కప్ – ఒలేగ్ సాలెంకో (రష్యా), హ్రిస్టో స్టోయిచ్కోవ్ (బల్గేరియా) – 6 గోల్స్

1998 ఫిఫా ప్రపంచ కప్ – దావర్ సుకర్ (క్రొయేషియా) – 6 గోల్స్

2002 ఫిఫా ప్రపంచ కప్ – రొనాల్డో నరాజియో (బ్రెజిల్) – 8 గోల్స్

2006 ఫిఫా ప్రపంచ కప్ – మిరోస్లావ్ క్లోస్ (జర్మనీ) – 5 గోల్స్

2010 ఫిఫా ప్రపంచ కప్ – థామస్ ముల్లర్ (జర్మనీ) – 6 గోల్స్

2014 ఫిఫా ప్రపంచ కప్ – జేమ్స్ రోడ్రిగ్స్ (కొలంబియా) – 6 గోల్స్

2018 ఫిఫా ప్రపంచ కప్ – హ్యారీ కేన్ (ఇంగ్లండ్) – 6 గోల్స్.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -