end
=
Thursday, November 6, 2025
వార్తలురాష్ట్రీయంకేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో మోసం.. జర భద్రం: తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరిక
- Advertisment -

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో మోసం.. జర భద్రం: తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరిక

- Advertisment -
- Advertisment -

Fact check: కేంద్ర ప్రభుత్వ పథకాల(Central Govt Schemes) పేరుతో మోసాలు చేస్తూ సైబర్ నేరగాళ్లు (Cyber ​criminals)సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా వాట్సప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఫేక్ లింక్స్ (Fake links)పంపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ లింక్స్‌లో క్లిక్ చేస్తే ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు అవకాశముందని నమ్మించే ప్రయత్నం జరుగుతోందని, అయితే ఇవి పూర్తిగా మోసపూరితమైనవని పోలీసులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు రూపొందించి వాటి ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రభుత్వ పథకం గురించి సమాచారాన్ని తెలుసుకోవాలంటే కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే నమ్మాలి అని అధికారులు స్పష్టం చేశారు. అసలు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాల గురించి ప్రచారం చేసేటప్పుడు అధికారిక ఛానళ్ల ద్వారానే చేస్తుందని, వాటికి సంబంధించి ఇతర లింకులు నమ్మకూడదని హెచ్చరించారు. ఎవరైనా ‘మీరు ఈ పథకానికి అర్హులు’ అంటూ మెసేజ్ పంపితే, దానిపై తక్షణమే విశ్వసించకుండా, సంబంధిత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటును సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వివరాలు, ఆధార్, ఓటర్ ఐడీ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదని తెలిపారు.

అలాగే, ఫేక్ లింక్స్ లేదా సందేహాస్పద మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిని పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న సూచనలు ఇచ్చారు. ‘సైబర్ నేరాలపై పోరాటంలో ప్రజల సహకారం ఎంతో అవసరం’ అని తెలిపారు. నేరగాళ్ల బాగోతాలు ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రజలు సాంకేతికంగా తెలిసినవారైతే ఈ మోసాలను తేలిగ్గా గుర్తించవచ్చని పేర్కొన్నారు. తొందరపడి ఏ లింక్‌నయినా ఓపెన్ చేయకుండా ముందుగా తనిఖీ చేయాలని, నిబంధనల మేరకు ఎలాంటి పథకానికి అర్హత ఉందో తెలుసుకొని తదనుగుణంగా అధికారిక మార్గాల ద్వారానే దరఖాస్తు చేయాలని తెలంగాణ పోలీసు శాఖ కోరుతోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -