end
=
Sunday, January 25, 2026
బిజినెస్‌వెండే బంగారమాయేనా..బంగారం, వెండి ధరలకు రెక్కలు
- Advertisment -

వెండే బంగారమాయేనా..బంగారం, వెండి ధరలకు రెక్కలు

- Advertisment -
- Advertisment -

Gold prices: దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు(Gold and silver prices) మరలా దూకుడు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా సాగిన ధోరణి ఒక్కసారిగా మారిపోవడంతో, పసిడి ధరలు ఊహించని విధంగా ఎగిసిపడ్డాయి. ఈ పెరుగుదలతో ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా శుభకార్యాలు, పండుగల ముందు ధరలు ఇలా ఆకాశాన్నంటడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ బంగారం మార్కెట్‌లో ఈ ఉదయం భారీ పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పూటకో పూట పెరుగుతున్న పరిస్థితిలో, ఈసారి రూ.1,360 ఒక్కరోజులోనే పెరగడం గమనార్హం. దీంతో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,29,820 వద్దకు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. 10 గ్రాములపై రూ.1,250 పెరుగుదలతో 22 క్యారెట్ల తుది ధర రూ.1,19,000గా నమోదైంది. ఈ పెరుగుదలతో పసిడి కొనుగోలు చేయాలనుకునేవారు మరింత ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

ఇక, వెండి ధరలు బంగారాన్ని మించి పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా కిలో వెండిపై ఒక్కరోజులోనే భారీగా రూ.9,000 పెరగడం వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,92,000కి చేరింది. నిపుణుల ప్రకారం మారకద్రవ్య మార్పులు, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చితి, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మార్కెట్ పరిశీలకులు చెబుతున్నదేమంటే, ప్రస్తుత గమనాన్ని బట్టి చూస్తే వెండిదర త్వరలోనే రూ.2 లక్షల మార్కును దాటే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ అనూహ్య పెరుగుదలతో సాధారణ కుటుంబాలు మాత్రమే కాదు, ఆభరణాల వ్యాపారులు కూడా అమ్మకాల వేగం తగ్గిపోతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల ముందు బంగారం–వెండి కొనుగోళ్లపై మరింత భారమవుతుండడంతో, చాలా మంది వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతోంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో బంగారం, వెండి కొనుగోళ్లు సాధారణ ప్రజలకు మరింత కష్టతరకాలవే కావచ్చని ఆభరణాల వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో స్థిరపడే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు స్పష్టత ఇవ్వనంతవరకు ఈ ధరల మార్పులు కొనసాగుతాయని నిపుణుల అంచనా.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -