end
=
Thursday, May 16, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంHoroscope:ఈ రోజు రాశిఫలాలు
- Advertisment -

Horoscope:ఈ రోజు రాశిఫలాలు

- Advertisment -
- Advertisment -
  • ఆ రాశులవారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి

జనవరి (January) 15వ తేదీ 2023న కెరీర్ (carrier)పరంగా, డబ్బుల పరంగా ఏ రాశులు అనువుగా ఉన్నాయి. రోజువారీ జాతకంలో సంక్రాంతి సందర్భంగా చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలు చూద్దాం.

మేషరాశి ఫలాలు (mesha raasi)
మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల ఇబ్బందులు కలుగిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు (employees)ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్త్రీలకు (women), కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మరిన్ని శుభఫలితాలు పొందడం దుర్గాదేవిని (durgadevi), సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది.

వృషభరాశి ఫలాలు
వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఒత్తిడి, వేదనలు ఎక్కువగా ఉంటాయి. మనస్తాపము, అనారోగ్యం కలుగే సూచనలున్నాయి. ఉద్యోగ, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ.. మీ శ్రమతో ఆలోచనతో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మిధునరాశి ఫలాలు
మిధునరాశివారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు నియంత్రించుకోండి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. సమస్యలను, ఒత్తిళ్లను నేర్పుతో అధిగమిస్తారు. మరిన్ని శుభఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటకరాశి ఫలాలు
కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్థము నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ధనలాభము, వస్తు లాభము కలుగును. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ధనమును ఖర్చు చేస్తారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆరోగ్య, ఆర్ధిక వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి.

సింహరాశి ఫలాలు
సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉంది. ఆరోగ్యం, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగ, వ్యాపారస్థులకు మధ్యస్థ ఫలితములున్నాయి. సమస్యలను నేర్పుతో అధిగమిస్తారు. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగును. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం సూర్యాష్టకము పఠించాలి.

కన్యారాశి ఫలాలు
కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఒత్తిడి తగ్గును. చేసే ప్రతీ పనిలో విజయం పొందుతారు. ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలిస్తుంది. స్త్రీ సౌఖ్యం కలుగును. శత్రువులపై విజయము పొందుతారు. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి.

తులా రాశి ఫలాలు
తులారాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. చేసే ప్రతీ పనిలో చికాకులు, సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబంలో సమస్యలు బాధిస్తాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి ఫలాలు
వృశ్చికరాశికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధన లాభము, వస్తులాభము కలుగును. చేసే ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. కుటుంబముతో ఆహ్లాదముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

ధనూ రాశి ఫలాలు
ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. చేసే పనుల్లో విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఏర్పడును. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

(Shabarigiri:మకర జ్యోతి దర్శనానికి తరలివచ్చిన భక్తులు)

మకర రాశి ఫలాలు
మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహరాలపట్ల జాగ్రత్త వహించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏలినాటి శని వలన పనుల్లో ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి ఫలాలు
కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలున్నాయి. ఆర్ధిక విషయాల పట్ల జాగ్రత్త వహించండి. అప్పులు పెరుగును. ఉద్యోగస్తులకు ప్రయత్నములు కలసివచ్చును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేసే ప్రతీ పనిలో కొంత ఆటంకములు ఏర్పడుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాష్టకం పఠిస్తే మంచిది.

మీన రాశి ఫలాలు
మీన రాశి వారికి ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. ఆర్ధిక లాభములు ఉంటాయి. వ్యాపార లాభము, ఉద్యోగస్తులకు కలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. కీర్తి, సౌఖ్యము కలుగును.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -