end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంఅంత గౌరవమే ఉంటే.. నెహ్రూ ఇంటి పేరును ఎందుకు పెట్టుకోలేదు : బీజేపీ ఘాటు ప్రతిస్పందన
- Advertisment -

అంత గౌరవమే ఉంటే.. నెహ్రూ ఇంటి పేరును ఎందుకు పెట్టుకోలేదు : బీజేపీ ఘాటు ప్రతిస్పందన

- Advertisment -
- Advertisment -

BJP: దేశ తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) వారసత్వాన్ని నిరంతరం దూషించడం కేంద్రంలోని అధికారపక్షం ప్రధాన లక్ష్యంగా మారిందని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తీవ్రస్థాయిలో విమర్శించారు. నెహ్రూ దేశ నిర్మాణంలో పోశించిన పాత్రను మసకబార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఆయనకు చెందిన చారిత్రక, సామాజిక, రాజకీయ పునాదులను చెరిపేయాలనే ధోరణి పెరుగుతోందని ఆమె ఆరోపించారు. స్వాతంత్ర్యానంతర కాలంలో భారత అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడిని రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నబుచ్చడం దురదృష్టకరమని సోనియా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నెహ్రూ చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరువలేదని, వివిధ దశల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలే భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసాయని ఆమె గుర్తుచేశారు.

చరిత్రను తిరగరాయడం ద్వారా ఎవరు ఏమి సాధించాలనుకుంటున్నారో ప్రజలకు తెలుసునని కూడా సోనియా అన్నారు. అయితే ఆమె విమర్శలను భారతీయ జనతా పార్టీ బలంగా ప్రతిఖండించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి టామ్‌ వడక్కన్‌ సోనియా గాంధీ చేసిన ఆరోపణలను పూర్తిగా నిరాధారమని ఖండించారు. ‘‘నెహ్రూపై మా పార్టీలో ఎవరికీ అవమానభావం లేదు. ఆయన చేసిన సేవలను తగ్గించాలనే ఉద్దేశ్యం మాకెప్పుడూ ఉండదు’’ అని వడక్కన్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలలో అంత గౌరవం నెహ్రూ పట్ల నిజంగా ఉంటే, ఆమె తన పేరులో ‘నెహ్రూ’ ఇంటిపేరును కొనసాగించకపోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నిజానికి నెహ్రూ కుటుంబ పేరును వాడటాన్ని మానేసింది కాంగ్రెస్‌ నాయకత్వమే. వారి చర్యలే నెహ్రూ వారసత్వాన్ని తగ్గిస్తున్నాయి.

ఇందులో భాజపా లేదా ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని వడక్కన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ వారసత్వం, ఆయన రాజకీయ పునాది, ప్రస్తుత రాజకీయ వాతావరణం ఈ అంశాల మధ్య చర్చ మళ్లీ వేడెక్కింది. కాంగ్రెస్‌ నేతలు నెహ్రూపై జరుగుతున్న విమర్శలు దేశ చరిత్రకు అన్యాయం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ప్రతివాదిస్తోంది. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాలు, విశ్లేషకులు వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా, నెహ్రూ పేరును చుట్టూత రాజకీయ వాదనలు మరికొంత కాలం కొనసాగనున్నట్టుగా కనిపిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -