end
=
Thursday, May 16, 2024
క్రీడలుMobile Phones:ఫొన్‌లో గేమ్స్‌ ఆడేవారి లిస్ట్‌లో భారత్‌ 2వ స్థానం
- Advertisment -

Mobile Phones:ఫొన్‌లో గేమ్స్‌ ఆడేవారి లిస్ట్‌లో భారత్‌ 2వ స్థానం

- Advertisment -
- Advertisment -

  • ఆసియాలో మొద‌టి స్థానంలో నిలిచిన చైనా
  • ‘ది ఆసియా 10 గేమ్స్‌ మార్కెట్’ జాబితా విదుదల


భార‌త‌దేశంలో (India) ప్రస్తుతం 39.6 కోట్ల గేమ‌ర్స్ (Gamers) ఉన్నారని గేమ్స్ మార్కెట్‌ (Games Market)కు చెందిన నికో పార్ట్‌న‌ర్స్ అనే కంపెనీ (Nico Partners company) వెల్లడించింది. ఆసియాలో (Asia) ఎక్కువ మంది గేమ‌ర్స్ ఉన్న రెండో దేశంగా భార‌త్ రికార్డు (Record)సాధించింది అయితే ప్రపంచంలో (World) ఎక్కువ మంది గేమ‌ర్స్‌తో చైనా (China) మొద‌టి స్థానం ఉండగా, రెండో స్థానంలో ఇండియా ఉంది.ఇటీవల ‘ది ఆసియా 10 గేమ్స్‌ మార్కెట్’ (‘The Asia 10 Games Market’) పేరుతో ఈ కంపెనీ ఒక‌ రిపోర్టు (Report) త‌యారు చేసింది. అందులో ఆసియాలోని ప‌ది (10 Countries)దేశాలతో పోల్చి చూస్తే 50.2 శాతం గేమ‌ర్స్ భారత్‌లోనే ఉన్నట్లు తెలిపింది. భారత్‌కు చెందిన గేమ‌ర్స్ వారానికి స‌గ‌టున 14 గంట‌లు మొబైల్ ఫోన్‌లలో (Mobile phones) గేమ్స్‌ ఆడుతున్నట్లు తెలిపింది.

గత ఐదేళ్లతో పోలిస్తే


ఇక గత ఐదు (5 Years ) సంవత్సరాలలో భార‌త్‌లో వీడియోగేమ్స్‌తో పాటు కంప్యూట‌ర్(Computer), మొబైల్ ఫోన్‌లలో ఆన్‌లైన్ గేమ్స్ (Videogames as well as online games on computer and mobile phones) ఆడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌ (Online games) ద్వారా ఆదాయం సంపాదించేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే అని ఈ నివేదిక ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప‌ర్సన‌ల్‌ కంప్యూట‌ర్, మొబైల్ గేమ్ మార్కెట్‌ (Personal computer and mobile game market)కు 35.9 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం (Billions of dollars in revenue) వ‌స్తుంద‌ని, 2026 నాటికి ఆదాయం 41.4 బిలియ‌న్ డాల‌ర్లకు చేరుతుంద‌ని నికో పార్ట్‌న‌ర్స్ (Nico Partners) అంచనా వేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -