end
=
Thursday, November 13, 2025
వార్తలుజాతీయంశాంతియుత అణుశక్తికి అండగా భారత్‌.. ఐక్యరాజ్యసమితిలో పురందేశ్వరి
- Advertisment -

శాంతియుత అణుశక్తికి అండగా భారత్‌.. ఐక్యరాజ్యసమితిలో పురందేశ్వరి

- Advertisment -
- Advertisment -

United Nations : భారత ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) ఐక్యరాజ్యసమితి (United Nations) సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. అంతర్జాతీయ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నివేదికపై జరిగిన ప్రచురిత చర్చల్లో భారతదేశం తరపున జాతీయ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా, అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితంగా, భద్రంగా వినియోగించడంలో IAEA కు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని వారు స్పష్టం చేశారు. పురందేశ్వరి అభిప్రాయానుసారం, అణుశక్తి వల్ల బహుముఖ పర ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం విద్యుత్ ఉత్పత్తి రంగంలో మాత్రమే కాదు, సుస్థిర అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అనేక కీలక రంగాల్లో అణు సాంకేతికత ముఖ్య పాత్ర పోషిస్తున్నదని వారు వివరించారు. ఈ దిశగా భారతదేశం సాధించిన ప్రగతి అసాధారణమైనది అని పురందేశ్వరి పేర్కొన్నారు.

ప్రజారోగ్య రంగంలో భారత్ సాధించిన విజయాన్ని ముఖ్యంగా ప్రస్తావించిన పురందేశ్వరి: దేశీయంగా అభివృద్ధి చేసిన ‘CAR-T సెల్ థెరపీ’ ద్వారా తక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని తెలిపారు. ఇది అణు పరిజ్ఞానం మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ అని అన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, భారతదేశం సామర్థ్య పెంపుదల, సాంకేతిక సహకారం వంటి కార్యక్రమాల ద్వారా ఇతర దేశాలతో అణు పరిజ్ఞానాన్ని పంచుకుంటూ IAEA తో నిరంతరం సంభంధాలు సృష్టిస్తున్నదని పురందేశ్వరి వెల్లడించారు. శాంతియుత అణుశక్తి వినియోగంలో ప్రపంచ దేశాలకు భారత్ అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -