end
=
Monday, November 3, 2025
క్రీడలుచరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ..ప్రపంచకప్ కిరీటంతో చారిత్రక విజయం
- Advertisment -

చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ..ప్రపంచకప్ కిరీటంతో చారిత్రక విజయం

- Advertisment -
- Advertisment -

ICC Women’s World Cup: భారత మహిళల క్రికెట్ జట్టు (Indian women’s cricket team)చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాన్ని సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల కలలను నిజం చేస్తూ, తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఆదివారం ముంబై (Mumbai)లోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయం కేవలం కప్ గెలుపే కాకుండా, భారత మహిళా క్రీడల శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఫైనల్ మ్యాచ్ చివరి దశల్లో ఊపిరిబిగపట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో విజయం ఎటు తిరుగుతుందో అర్థంకాని స్థితి. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వం, అలాగే స్మృతి మందానా, రెణుకా సింగ్, దీప్తి శర్మల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయం దిశగా దూసుకెళ్లింది. చివర్లో దక్షిణాఫ్రికా జట్టు ప్రతిఘటించినా, భారత బౌలర్లు చల్లగా ఆడి, చారిత్రక విజయం సాధించారు.

ఈ గెలుపుతో భారత్, ఇంగ్లండ్ మరియు ఆస్ట్రేలియా తర్వాత, పురుషుల మరియు మహిళల వన్డే ప్రపంచకప్‌లను గెలుచుకున్న మూడో దేశంగా నిలిచింది. గ్రూప్ స్టేజీలో వరుసగా మూడు మ్యాచ్‌లను కోల్పోయి, కష్టతరంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై విజయం సాధించి, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి కప్‌ను లిఫ్ట్ చేయడం క్రీడా చరిత్రలో ఒక అద్భుత పునరాగమన కథగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విజయం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా టెక్ రంగం దిగ్గజాలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరియు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత జట్టును ప్రత్యేకంగా అభినందించారు. ఎక్స్ (ట్విట్టర్)లో సుందర్ పిచాయ్ స్పందిస్తూ, “ఇది 1983, 2011లో పురుషుల ప్రపంచకప్ గెలిచిన జ్ఞాపకాలను తలపిస్తోంది. ఉత్కంఠభరితమైన ఫైనల్! టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

సత్య నాదెళ్ల కూడా తన అభినందనలు తెలుపుతూ..వుమెన్ ఇన్ బ్లూ ప్రపంచ చాంపియన్స్! ఇది మహిళల క్రికెట్‌లో చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించబడ్డాయి, అడ్డంకులు చెరిపివేయబడ్డాయి, కొత్త లెజెండ్స్ పుట్టుకొచ్చారు అని అన్నారు. ఈ చారిత్రక విజయం కేవలం భారత క్రికెట్‌కే కాదు, ప్రతి భారత మహిళకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కష్టసాధ్యమైన మార్గాన్ని అధిగమించి, కఠిన శ్రమతో సాధించిన ఈ విజయం ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళల సత్తాను మరోసారి నిరూపించింది. దేశవ్యాప్తంగా సంబరాలు నిండిపోగా, ఈ విజయం భారత క్రీడా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. కాగా, మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలిచిన జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ అందిస్తారు. భారత కరెన్సీలో దాదాపు 40 కోట్ల రూపాయలు. 2023 పురుషుల ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 4 మిలియన్ డాలర్లు లభించాయి. అంతకంటే ఎక్కువ నేటి విజేత దక్కించుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు సైతం 2.24 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 20 కోట్లు లభిస్తాయి. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -