end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంబంగ్లాదేశ్ అభ్యర్థన..హసీనా అప్పగింతపై భారత్ కీలక ప్రకటన
- Advertisment -

బంగ్లాదేశ్ అభ్యర్థన..హసీనా అప్పగింతపై భారత్ కీలక ప్రకటన

- Advertisment -
- Advertisment -

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా(Sheikh Hasina)ను తమకు అప్పగించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను భారత్ స్వీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం (Central Govt)ధృవీకరించింది. ఈ అభ్యర్థనను ప్రస్తుత న్యాయపరమైన, అంతర్గత చట్టపరమైన విధానాల ప్రకారం పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. గతేడాది విద్యార్థుల నేతృత్వంలో చెలరేగిన పెద్ద ఎత్తున నిరసనలను అణచివేసినందుకు ‘మానవతా వ్యతిరేక నేరాలు’ నమోదు చేయబడగా, ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ ఇటీవల 78 ఏళ్ల షేక్ హసీనాకు మరణదండన విధించిన సంగతి తెలిసిందే.

ఇదే కేసులో అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌ కూడా మరణశిక్షకు గురయ్యారు. భారీ ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో, 2023 ఆగస్టు 5న హసీనా బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతూ జీవిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హసీనాను తిరిగి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల అధికారిక లేఖను న్యూఢిల్లీకి పంపింది. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్, అభ్యర్థన సంబంధించిన అన్ని అంశాలు మా చట్టపరమైన ప్రక్రియల ప్రకారం పరిశీలనలో ఉన్నాయి అని వెల్లడించారు. రెండు దేశాల మధ్య అమల్లో ఉన్న అప్పగింత ఒప్పందం (ఎక్స్‌ట్రడిషన్ ట్రీటీ) ప్రకారం హసీనాను తక్షణమే అప్పగించాల్సిన బాధ్యత భారత్‌కే ఉందని బంగ్లాదేశ్ వర్గాలు వాదిస్తున్నాయి.

అయితే, ఈ తీర్పును షేక్ హసీనా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నుకోబడని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలుబొమ్మ ట్రైబ్యునల్ లో తనపై విచారణ జరిపి ఉద్దేశపూర్వకంగా మరణశిక్ష విధించారని ఆమె ఆరోపించారు. ఇదే సమయంలో, ఈ ట్రయల్ ప్రక్రియలో పలు రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని, ముఖ్యంగా న్యాయమూర్తుల నియామకం సహా అనేక విధానాలు సరైన చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవని భారత ప్రాథమిక పరిశీలనలో బయటపడినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అక్కడి పరిస్థితులు స్థిరపడాలని, ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుద్ధరించబడాలని భారత్ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాయి. హసీనా అప్పగింతపై తీసుకోబోయే నిర్ణయం రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఈ అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు మూలాలు సూచిస్తున్నాయి.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -