end
=
Thursday, May 16, 2024
ఫీచ‌ర్స్ ‌వంటలుస్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయండిలా
- Advertisment -

స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయండిలా

- Advertisment -
- Advertisment -

నెయ్యి అంటే చాలా మంది శాఖాహారులు ఇష్టంగా తింటారు. నెయ్యిలో అనేకమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా నెయ్యి తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా కుటుంబాలలో నెయ్యిని రోజువారి మెనూలో తప్పనిసరి. అయితే మార్కెట్‌లో లభించే రక రకాల బ్రాండ్‌ల నెయ్యిపై అపోహలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా వరకు నెయ్యిలో డాల్డా, పామ్‌ఆయిల్‌ కలుపుతున్నారనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. కాబట్టి స్వతహాగా మన ఇంట్లోనే మన చేతుల మీదుగా నెయ్యి తయారు చేసుకుంటే ఇక దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. పైగా మనమే తయారు చేసాము కాబట్టి కల్తీపై సందేహం ఉండదు.

ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి?

  1. రెండు లీటర్ల పాలు తీసుకొని ఒక పాత్రలో మరగబెట్టండి. పాలు కాస్త బంగారం రంగు వచ్చేంత వరకు స్టవ్‌ను సిమ్‌లో ఉంచుతూ మరగనివ్వండి. పాలపై మీగడ/మెట్టు వచ్చేంతవరకు మరగిస్తూనే ఉండండి. తర్వాత వచ్చిన మీగడను తీసి ఒక పాత్రలో వేసుకోండి. ఇలా ఆరు రోజుల పాటు ఇలా 2 లీటర్ల పాలను మీగడ తీస్తూ ఫ్రిజ్‌లో ఉంచండి.
  2. ఆరు రోజుల తర్వాత ఆ మీగడ/క్రీమ్‌ ను ఫ్రిజ్‌ నుండి బయటకు తీసి గది ఉష్ణోగతకు వచ్చేంత వరకు అలా ఉంచేయండి. ఆ తర్వాత ఆ మీగడకు రెండు టేబుల్‌ స్పూన్‌ల పెరుగును కలపి ఒక రాత్రంతా అలాగే ఉంచండి.
  3. రెండు గ్లాసుల చల్లటి నీటిని కలపండి. వీలైతే ఐస్‌ ముక్కలను కూడా వేయవచ్చు. చల్లటి నీటి వల్ల మిశ్రమం నుండి కొవ్వు విడిపోతుంది. ఇప్పుడు కేవలం వెన్న ఏర్పడుతుంది. ఆ వెన్నను వేరే ప్రాతలోకి తీసుకోండి.
  4. ఇప్పుడు ఆ వెన్న ముద్దను వేరే ప్రాతలోకి తీసుకొని సన్నటి మంటమీద వేడి చేయడం ప్రారంభించండి. వెన్న కరిగి నెయ్యిగా మారడం మీరు గమనిస్తారు.
  5. వేడి నెయ్యిని చల్లబడే వరకు వేచి చూడండి. ఆ తర్వాత గాజు సీసాలో పోసి భద్రపరుచుకోండి.
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -