end
=
Wednesday, May 15, 2024
వార్తలురాష్ట్రీయంmallanna jātara:స్వామివారికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి
- Advertisment -

mallanna jātara:స్వామివారికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి

- Advertisment -
- Advertisment -

  • బంగారు కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీశ్ రావు

తెలంగాణ(Telangana) రాష్ట్రానికే తలమానికం కొమురవెల్లి మల్లన్న జాతర అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు. మల్లన్న మన కొంగు బంగారమని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి(Komuravelli Mallikarjuna Swamy) క‌ల్యాణోత్స‌వంలో మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న స్వామికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వస్త్రాలతో పాటు రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. మల్లన్న స్వామివారి కల్యాణం అంగరంగా వైభవంగా(Gloriously) జరగడం, స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. కొముర‌వెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ. 30 కోట్లు కేటాయించార‌ని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్(CM KCR) మల్లన్న స్వామివారిని రెండుసార్లు దర్శించుకున్నారు. వచ్చే ఏడాది మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం(Golden crown) తయారు చేయిస్తామని మంత్రి ప్ర‌క‌టించారు.  రూ.11కోట్ల రూపాయలతో భక్తులకు కావాల్సిన క్యూలైన్లు, 50 గదులతో సత్రం, కోనేరు అభివృద్ధి, దేవాలయం అభివృద్ధి ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నాం. మల్లన్న దేవుడి దయతో, సీఎం కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్(Mallanna Sagar) పూర్తి చేసుకుని పలు జిల్లాలకు సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరుగుతున్నద‌ని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నార‌ని హ‌రీశ్ రావు తెలిపారు.

(Bigg Boss 6:‘బిగ్ బాస్’ విజేతగా రేవంత్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -