end
=
Monday, April 29, 2024
వార్తలుజాతీయంమోడీ పాపులారిటీ పెరిగింది
- Advertisment -

మోడీ పాపులారిటీ పెరిగింది

- Advertisment -
- Advertisment -

దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగినట్లు తెలిపిన సర్వేలు

Mood of the Nation poll: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వ పాపులారిటీ దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఇదే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ గత సంవత్సరం ఆగస్ట్ నెలలో నిర్వహించిన సమయంలో ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వ పాపులారిటీ 56% గా ఉండగా, అది ప్రస్తుతం, అంటే జనవరి 2023 నాటికి 67 శాతానికి పెరిగింది. అలాగే, మోదీ (PM Modi) ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజల శాతం కూడా 32 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం గమనార్హం. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వ వ్యతిరేకతను మోదీ ప్రభుత్వం అధిగమించినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోంది.

2024 లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రజల్లో వివిధ అంశాలపై నెలకొన్న అభిప్రాయాలపై సీ ఓటర్, ఇండియా టుడే ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ (Mood of the Nation poll) నిర్వహించాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లోని సుమారు 39,909 మందిని ప్రశ్నించి, సమాచారం సేకరించారు. అలాగే, సీ ఓటర్ ట్రాకర్ డేటా నుంచి లక్ష మంది కి పైగా పౌరుల అభిప్రాయాలను సేకరించారు. 2022 డిసెంబర్ 15 నుంచి 2023 జనవరి 15 వరకు ఈ సర్వే నిర్వహించారు.

మోదీ (PM Modi) సాధించిన విజయాల్లో కొరోనా పై పోరాటం, కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, అయోధ్యలో రామ మందిరం, జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ను రద్దు చేయడం ప్రధానమైనవిగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నోట్ల రద్దు మొదలైన వాటిని మోదీ (PM Modi) ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాలుగా తీర్పునిచ్చారు. ముఖ్యంగా ధరల పెరుగుదలను 25%, నిరుద్యోగాన్ని 17% అతిపెద్ధ వైఫల్యాలుగా నిర్ధారించారు. అలాగే, ఉమ్మడి పౌర స్మృతి అవసరమని 69% అభిప్రాయపడగా, అవసరం లేదని 19% స్పష్టం చేశారు. పాఠశాలల్లో హిజాబ్ ను నిషేధించాలని 57%, నిషేధించకూడదని 26% అభిప్రాయపడ్డారు.

మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ లో పాల్గొన్నవారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) పై స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మంచి ప్రచారం పొందిందని, అయితే, దానివల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం సాధ్యం కాదని సర్వేలో పాల్గొన్న వారిలో 37% మంది అభిప్రాయపడ్డారు. అయితే, దేశ ప్రజలతో కనెక్ట్ కావడానికి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఈ యాత్ర (Bharat Jodo Yatra) చాలా ఉపయోగపడిందని 29% అభిప్రాయపడ్డారు. నాయకుడిగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) రీ బ్రాండింగ్ కు ఈ యాత్ర (Bharat Jodo Yatra) ఉపయోగపడిందని 13% తెలిపారు.

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ‘ఇండియా టుడే–సీవోటర్’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్​ద నేషన్’ జనవరి ఎడిషన్ సర్వేలో వెల్లడైంది. లోక్ సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 284 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ప్రధాని మోడీ పాపులారిటీ చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోడీ పనితీరు పట్ల తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు పట్ల 67% మంది సర్వేలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్ట్ లో 56 శాతం మందే సంతృప్తి వ్యక్తంచేయగా.. తాజాగా గవర్నమెంట్ అప్రూవల్ రేటింగ్ 11 శాతం పెరిగింది. అలాగే 2022 ఆగస్ట్ లో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత 37 శాతం ఉండగా, తాజాగా అది18 శాతానికి తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా 1,40,917 మందిపై ఈ సర్వే నిర్వహించారు. వీరికి అదనంగా సీవోటర్ రెగ్యులర్ ట్రాకర్ ద్వారా మరో1,05,008ని ఇంటర్వ్యూ చేసిన ఈ సర్వే ఫలితాలను గురువారం విడుదల చేశారు.

ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలేంటీ? అని ప్రశ్నించగా.. కొవిడ్ మేనేజ్మెంట్ అని 20%, ఆర్టికల్ 370 రద్దు అని 14%, అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం అని 12% మంది చెప్పారు. మోడీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. ధరల పెరుగుదల అని 25%, నిరుద్యోగం అని 17%, కరోనా మేనేజ్మెంట్ అని 8% మంది బదులిచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్​ తేవాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నకు దాదాపు 69% మంది అవునని అన్నారు. స్కూల్స్​ హిజాబ్ బ్యా న్ చేయాల్నా? అంటే.. 57% మంది అవునని చెప్పారు. 26% మంది అవసరంలేదన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ బలం పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు సీట్లు ఉండగా..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఆరు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. అదేవిధంగా ప్రధాని మోడీకి ప్రతిపక్షాల కూటమి సవాలుగా మారనుందా? అంటే.. 2022లో 49% మంది అవునని చెప్పగా.. తాజాగా 39% మందే అవునన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -