end
=
Wednesday, May 15, 2024
వార్తలురాష్ట్రీయంతారకరత్న హెల్త్ అప్‌‌డేట్
- Advertisment -

తారకరత్న హెల్త్ అప్‌‌డేట్

- Advertisment -
- Advertisment -

  • మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు
  • ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తోన్న వైద్యులు

Tarakaratna : టాలీవుడ్ హీరో తార‌క‌ర‌త్న (Tollywood hero Tarakaratna) తీవ్ర అస్వస్థత‌తో ఆసుప‌త్రిలో చేరారు. టీడీపీ (TDP) నాయ‌కుడు నారా లోకేష్ (Nara Lokesh) చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్రలో పాల్గొనగా అస్వస్థతకు లోన‌వ్వడంతో పార్టీ శ్రేణులు ఆయ‌న్ని ఆసుప‌త్రిలో చేర్పించారు. అయితే అది గుండెపోటుగా డాక్టర్లు (heart attack) నిర్ధారించగా తాజా సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కోలుకుంటున్నట్లు తెలిపారు.

ఈ మేరకు గుండెకు ర‌క్తం వెళ్లే నాళాల్లో బ్లాక్ (Blocks) ఏర్పడ‌టంతో తార‌క‌ర‌త్నకు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి (TDP senior leader Gorantla Butchaiah Chaudhary) తెలిపాడు. యాంజియోగ్రామ్ (Angiogram) ప‌రీక్షలో ఈ స‌మ‌స్యను వైద్యులు గుర్తించిన‌ట్లు ఆయ‌న తెలిపాడు. ప‌ల్స్ రేటు కూడా త‌క్కువ‌గానే ఉన్నట్లు స‌మాచారం. ప్రస్తుతం తార‌క‌ర‌త్నకు డాక్టర్స్ చికిత్సను అందిస్తున్నట్లు తెలిసింది. ప్రమాద‌మేమి లేద‌ని వైద్యులు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గా మంది అభిమానులు రావ‌డంతోనే తార‌క‌ర‌త్న అస్వస్థత‌కు లోనైన‌ట్లు తెలిసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో తరచుగా తార‌క‌ర‌త్న భాగం అవుతోన్నారు. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, ఎడమ కవాటం 90 శాతం మూసుకుపోయిందని వైద్యులు తెలిపినట్లు నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

శుక్రవారం కుప్పంలో లోకేష్‌ ‘యువగళం’ (Yuavagalam) పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. కొద్దిసేపు పాదయాత్రలో నడిచిన తర్వాత తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే ఆయనను దగ్గర్లోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనకు పల్స్ రేటు చాలా తక్కువగా ఉందని.. 40 నిమిషాల సేపు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించడంతో పల్స్ రేటు పెరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపై మెరుగైన చికిత్స కోసం.. గుడుపల్లె మండలంలోని పీఈఎస్‌ (PES) మెడికల్ కాలేజ్‌కు తరలించారు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్లు.. తీవ్ర గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఆపై బెంగళూరు ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలా..? రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలా అన్న అంశంపై తర్జనభర్జనలు జరిగాయి. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి (Wife Alekhya Reddy), కుమార్తె ఆసుపత్రికి వచ్చారు. ఆపై వైద్యులతో మాట్లాడి బెంగళూరుకు (Bengalore) తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడి హృదయాలయలో తారకరత్నకు డాక్టర్ ఉదయ్ (Dr. Uday) అండ్ టీం చికిత్స అందిస్తున్నారు.

కాగా తారకతర్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు చంద్రబాబు (Chendrababu). జూనియర్ ఎన్టీఆర్ (NTR) సైతం బాలయ్యకు ఫోన్ చేసి.. అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. పాదయాత్ర ముగిశాక రాత్రి 8.20 గంటలకు లోకేశ్‌ ఆసుపత్రికి వెళ్లి.. వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తారకరత్న బాబాయి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తారకరత్న విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించడం దగ్గర నుంచి రాత్రి బెంగళూరు తీసుకెళ్లేంత వరకు తారకరత్న వెంటే ఉన్నారు. అర్థరాత్రి వరకు ఆస్పత్రి దగ్గరే ఉండి అందిస్తున్న చికిత్సపై అనుక్షణం ఆరాతీశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఆశీస్సులు, భార్య బలం, అభిమానుల ప్రేమ తారకరత్నను కాపాడతాయన్నారు బాలయ్య.

యువగళం పాదయాత్రలో తీవ్రమైన గుండెపోటుకు గురైన తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించాలని నిర్ణయించారు. అయితే ఎయిర్‌ లిఫ్ట్ చేయాలా.. లేక రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలా అనేది ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పారు బాలకృష్ణ. ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఆయన కుడి, ఎడమ రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక తారకరత్న ఆరోగ్యంపై దగ్గరుండి ఆరాతీస్తున్నారు బాలకృష్ణ. అటు చంద్రబాబు వైద్యులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం హెల్త్‌ కండీషన్ స్టేబుల్‌గా ఉందని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ లోకేష్‌ వెంటే ఉన్నారు. కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు . కుప్పం (Kuppam) సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తోసుకుని వచ్చారు. ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు తారకరత్న. వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తోంది.

అయితే తాజా అప్డేట్ ప్రకారం.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరు (Taraka Ratna Shifted To Bangalore)కు తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో.. డాక్టర్లతో పాటూ అందరితో చర్చించి బెంగళూరుకు తరలించారు. తారకరత్న వెంట సతీమణి అలేఖ్యారెడ్డి, నందమూరి బాలయ్య కూడా వెళ్లారు. శుక్రవారం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం తీసుకొచ్చారు. ఆ అంబులెన్స్‌లోనే కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే బెంగళూరు నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకురావడంతో కుప్పం పీఈఎస్‌ ఆసుపత్రిలోనే నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు వైద్యం అందించారు. అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -