- కేరళ, పశ్చిమ బెంగాల్‌లో పేలుళ్లకు పన్నాగం
- ఆకస్మిక దాడులు నిర్వహించి ఉగ్రవాదులను అరెస్టు చేసిన NIA
దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అల్‌ఖైదా ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు పశ్చిమబెంగాల్, కేరళలో అల్‌ఖైదా తీవ్రవాదులు ఉగ్రదాడులకు పాల్పడటానికి సిద్దమవుతున్నట్లు తెలుసుకున్న ఎన్.ఐ.ఎ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 9 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
వీరి నుంచి డిజిటల్ పరికరాలు, జిహాదీ సాహిత్యం, పదునైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి వినియోగించే లిటరేచర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని ఢిల్లీకి తరలించి కోర్టులో హాజరు పరచనున్నారు. కేరళలోని ఎర్నాకుళం, పశ్చిమబెంగాల్‌లోని ముషీరాబాద్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.
మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు
అయితే వీరు కేరళలోని ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలలో పేలుళ్లకు కుట్రపన్నుతున్నట్లు తెలిసింది. అలాగే ఇంకొంత మంది అల్‌ఖైదా సానుభూతిపరులకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్లు కూడా తెలిసింది. ఈ కుట్రను భగ్నం చేసి అందరినీ అరెస్టు చేసినట్లు ఎన్.ఐ.ఎ వర్గాలు వెల్లడించాయి.