రామారావు అనేది చాలా పవర్‌ఫుల్ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. ఓ సర్వేలో ‘నంబరు వన్ తెలుగు పర్సనాలిటీ’గా నందమూరి తారక రామారావు నిలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. ఇదే పేరున్న కేటీఆర్ గొప్ప నాయకుడు. ఇలా ‘రామారావు’ అనే పేరు స్ఫూర్తి నింపుతుంటుంది. అందుకే ఇందులోని కథానాయకుడి పాత్రకు రామారావు అనే పేరు పెట్టా. అదే టైటిల్ అయింది.” అని శరత్ అన్నారు.
మాస్ మహారాజా రవితేజ బిగ్ స్క్రీన్లపై ఆడియన్స్‌ను అలరించేందుకు డ్యూటీ ఎక్కేశాడు. రామారావు ఆన్ డ్యూటీ మూవీ నేటి (జులై 29) నుంచి థియేటర్స్‌లో సందడి చేస్తోంది. శరత్ మండవ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటించారు. వేణు తొట్టెంపూడి కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకోవడం రవితేజ పవర్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి మాస్ మహారాజా ఆ అంచనాలను అందుకున్నాడా? రవి తేజ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ పడినట్లేనా? ట్వీట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో హై ఓల్టేజ్ మాస్ డైలాగ్స్‌లో మాస్ మాహారాజా అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చని ఆడియన్స్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఉందంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ చాలాబాగా చూపించారు అని చెబుతున్నారు. శరత్ మండవకు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమానే అయినా రవి తేజను సరికొత్తగా చూపించాడని కొన్ని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయంటున్నారు.