Ma Inti Bangaram : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో కట్టిపడేస్తూ అభిమానులను సంపాదించుకుంటున్ననటి సమంత(Actress Samantha) ఇప్పటికే సొంత ప్రొడక్షన్‌లో సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె నిర్మాతగా ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ‘శుభం` చిత్రం గతేడాది విడుదలై మిశ్రమ స్పందన పొందింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తాజాగా సమంత మరో చిత్రాన్ని ప్రారంభించారు. ఆ చిత్రం పేరు ‘మా ఇంటి బంగారం’. చిత్రంలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య గౌతమి, మంజుష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు కూడా భాగస్వాములు. ‘ఓ బేబి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, నందినిరెడ్డి కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సీతా మీనన్, వసంత్ మరిన్‌గంటి కథ, స్క్రీన్‌ప్లే అందించగా ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలను తెలిజేస్తామని మేకర్స్ తెలిపారు.
- Advertisment -
సమంత ‘మా ఇంటి బంగారం’
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -
